గ్రీన్ “టీ”తో రాలే జుట్టుకి పరిష్కారం

Bhavannarayana Nch

జుట్టు వూడిపోవడానికి హార్మోన్ల ప్రభావం ఎంత ఉంటుందో.. దుమ్మూ ..చుండ్రూ, ధూళీ కాలుష్యం.. ఇలా అనేకరకాల కారణాలుంటాయి. మరి జుట్టు ఊడిపోతుంది ఈ సమస్య దూరం అవ్వాలి అంటే ఎలా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి అనేది పరిశీలిస్తే. చాలా సులభంగా ఈ సమస్యకి చెక్ పెట్టచ్చు.

 

కుదుళ్ళకి రక్త ప్రసరణ సరిగా వెళ్లకపోవడం వలన అవి బలహీన పది ఊడిపోతు ఉంటాయి.. అలాంటప్పుడు సరిగా రక్త ప్రసరణ అందేలా చేస్తే సమస్య దూరం అవుతుంది...ఈ విషయంలో గ్రీన్‌ టీ చాలా బాగా ఉపయోగ పడుతుంది. గ్రీన్ టీ లో ఉండే యాంటిఆక్సిడెంట్ జుట్టుమీద ఎటువంటి ప్రభావం లేకుండా చూస్తాయి..అంతేకాదు మాడుపై వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించి జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. అరకప్పు గ్రీన్‌టీలో ఒక గుడ్డు తెల్లసొన వేసి బాగా కలిపి తలకు పట్టించి.. అరగంటయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు ఎంతో బలంగా తయారవుతుంది.

 

అదేవిధంగా కొబ్బరి కాయ ఆలీవ్ ఆయిల్ ..ఈ రెండింటినీ కలిపి తలకు రాసుకోవడం వల్ల జుట్టుకు కావల్సిన పోషణ అందుతుంది. ఈ రెండునూనెల్ని తగినంత తీసుకుని  వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే మాడుకు పట్టించి మృదువుగా రాయాలి. ఒక గంట తరువాత..కుంకుడు రసంతో తల స్నానం చేసినా సరే జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతూ ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: