ఈ నూనెతో జుట్టు సమస్యలు ఈజీగా మాయం?

Purushottham Vinay
చలికాలం వచ్చిందంటే ఖచ్చితంగా డల్ స్కిన్, చర్మం పొడిబారడం, కరుకుదనం వంటి సమస్యలు ఈజీగా తలెత్తుతాయి. పైగా ఈ సమయంలో వాతావరణంలో తేమ స్థాయి కూడా తక్కువగా ఉంటుంది. అలాగే కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది.ఇది ఖచ్చితంగా ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. ఇంకా అంతేకాకుండా ఈ కాలంలో చుండ్రు సమస్య కూడా చాలా మందిలో తలెత్తుతుంది. మన తలలోని చర్మం పొడిగా మారి ఏడాది పొడవునా చుండ్రు సమస్య తలెత్తుతుంది. ఈ చుండ్రు వల్ల తల దురద పెట్టి, జుట్టు రాలడం కూడా ప్రారంభమవుతుంది.చలికాలంలో ప్రతిరోజూ షాంపూ చేయడం అనేది అస్సలు సాధ్యం కాదు. అందువల్ల మన తలపై ఎక్కువగా నూనె, మురికి  పేరుకుపోతుంది. అందుకే జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలంటే వారానికి కనీసం రెండుసార్లు ఖచ్చితంగా షాంపూ చేయాలి. ఇలా మూడు వారాలు చేస్తే సమస్య చాలా వరకు చాలా ఈజీగా తొలగిపోతుంది.మన ఇంట్లో తయారు చేసుకునే ఈ నూనె చుండ్రు సమస్యను ఈజీగా పారదోలుతుంది.


వేప ఆకులను తీసుకొని వాటిని ఎండలో ఉంచి బాగా ఎండబెట్టాలి. ఆ తర్వాత ఈ ఆకులను బాగా కడిగి, వడకట్టి కొద్దిగా నీళ్లు పోసి వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక కడాయిని గ్యాస్ మీద ఉంచి, చెంచా మెంతులు, ఒక చెంచా నల్ల జీలకర్ర వేసి, అందులో 150 గ్రాముల కొబ్బరినూనెని వేసుకోవాలి. ఆ తరువాత అందులో 50 గ్రాముల ఆవాల నూనె కూడా వేసుకోవాలి.తరువాత ఈ నూనెను తక్కువ మంటపై ఒక 15 నిమిషాలు కాగనివ్వాలి. ఆ తరువాత అందులో వేప ముద్ద కూడా వేయాలి. ఇక ఈ నూనె కాగిన తర్వాత అది నల్లగా మారుతుంది. అది నల్లగా మారిన తర్వాత గ్యాస్‌ను ఆఫ్ వేసి మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి.ఇక అది పూర్తిగా  చల్లారిన తర్వాత ఒక గిన్నెలో తెల్లటి కాటన్ క్లాత్‌లో వడకట్టాలి. అంతే వేపనూనె ఈజీగా రెడీ  అయినట్లే. ఈ నూనెని స్నానానికి రెండు గంటల ముందు రాసుకోవాలి. ఆ తర్వాత షాంపూ చేసుకుంటే చుండ్రుతో పాటు పేల సమస్య కూడా చాలా ఈజీగా తొలగిపోతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి. జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: