పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా బాగా సహాయపడతాయి. అయితే పెరుగు కేవలం మన శరీర ఆరోగ్యాన్నే కాదు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. పెరుగును ఉపయోగించడం వల్ల ముఖం చాలా అందంగా ఇంకా కాంతివంతంగా తయారవుతుంది. చర్మంపై ఉండే మృతకణాలు కూడా ఈజీగా తొలగిపోతాయి. ఇంకా అలాగే చర్మం పొడిబారకుండా తాజాగా ఎల్లప్పుడూ నిగనిగలాడుతూ ఉంటుంది. అలాగే దీనిలో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.పెరుగును ఉపయోగించడం వల్ల దెబ్బతిన్న చర్మ కణాలు తిరిగి ఈజీగా సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఎండ వల్ల నల్లగా మారిన చర్మం కూడా తెల్లగా మారుతుంది. అయితే ఈ పెరుగును ఎలా ఉపయోగించడం వల్ల మనం చక్కటి అందాన్ని సొంతం చేసుకోవచ్చో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.
ఈ సూపర్ చిట్కాను తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల పెరుగును తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ గోధుమపిండిని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చేత్తో కానీ లేదా బ్రష్ తో కానీ ముఖానికి రాసుకోవాలి. తరువాత ఈ ప్యాక్ పూర్తిగా ఆరే దాకా ముఖాన్ని కదిలించకుండా అలాగే ఉంచాలి.ఇంకా ఈ ప్యాక్ పూర్తిగా ఆరిన తరువాత నీటితో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మ సమస్యలు చాలా ఈజీగా తగ్గు ముఖం పడతాయి. ఎండ వల్ల ముఖంపై పేరుకుపోయిన ట్యాన్ కూడా సులభంగా తొలగిపోతుంది. అలాగే చర్మంపై ఉండే మృతకణాలు ఈజీగా తొలగిపోయి ముఖం అందంగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. ఈ సూపర్ చిట్కాను తరచూ వాడడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు.కాబట్టి ఈ టిప్ ని తయారు చేసుకొని వాడండి. అందమైన నిగ నిగ లాడే ముఖాన్ని మీ సొంతం చేసుకోండి.