రెండు కండ్లు చాలవు ఆ జలపాతం చూడాలంటే..!

MOHAN BABU
అడవుల్లో మనకు తెలియని ఎన్నో సోయగాలు దాగి ఉంటాయి.ఆ సోయగాల చూడడానికి రెండు కండ్లు చాలవు. పచ్చని చెట్ల నడుమ చినుకు చినుకు ఏకమై పెద్ద పాతాళగంగ ఎంతో ఎత్తు నుంచి కిందికి జారుతున్న ఆ పాలలాంటి నీళ్లను చూస్తే మనసు పులకరించిపోతుంది. వాన కాలం వస్తే చాలు ఆ జలపాతం పరుగులు పెడుతుంది. దాని అందాన్ని చూడడానికి ఎంతోమంది జలపాత ప్రేమికులు వెళ్తుంటారు. ఎక్కడో చూద్దామా..?
ఆదివారం కురిసిన వానలతో ఆ జలపాతం జోరుగా పారుతున్నది. ఆదివారం వర్షాలు ఎక్కువ ఉండడంతో ఎత్తయిన కొండల మీద నుంచి నీరంతా పాలలా కిందకు వస్తుంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం  రాయికల్ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో పచ్చని అడవిలో ఎత్తయిన గుట్టల మధ్య నుంచి మీరు జారుకుంటూ పాయలు, పాయలుగా వస్తుంది.  జలపాతం అందాలను చూడటానికి కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి సందర్శకుల తాకిడి మొదలవుతుంది. ఇది దట్టమైన అడవిలో ఉండటం వలన చాలా సంవత్సరాలు ఎవరు గుర్తించలేకపోయారు. గత ఐదు సంవత్సరాల క్రితం ఈ జలపాతాన్ని గుర్తించి సందర్శకుల తాకిడి పెరగడంతో జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని ఇక్కడి జిల్లావాసులు కోరుతున్నారు.
 ఈ గుట్టల నడుమ ఉండే చెరువును చూడటానికి మన కళ్ళు సరిపోవు. ఆ చెరువులో బోటింగ్ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, రాయికల్ గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. జలపాతం వెళ్లడానికి  అంతా చెట్ల నడుమ మట్టి రోడ్డు  ఉండడంతో సందర్శకులు వెళ్లడానికి ఇబ్బంది కలుగుతుందని, కాబట్టి ప్రభుత్వం గుర్తించి  ఆ జలపాతం వరకు బిటి రోడ్డు వేస్తే బాగుంటుందని జలపాతాన్ని వచ్చిన సందర్శకులు కోరుతున్నారు. హుస్నాబాద్ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్ దీనిని ప్రభుత్వం గుర్తించి, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఏది ఏమైనా  తెరచాటున ఉన్న ఈ జలపాతాన్ని తెర ముందుకు  తీసుకువస్తే అది పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆ చుట్టు పక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఆశిస్తున్నారు. ఇన్ని రోజులు కరోణతో ఇంట్లోనే మగ్గిపోయిన జనాలు ఇప్పుడు అలాంటి జలపాతాలను చూడటానికి  పోటెత్తుతున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: