ఇలా చేస్తే మీ చర్మం మెరవడం ఖాయం...

Purushottham Vinay
మెరిసే చర్మం కావాలని అందరూ కోరుకుంటారు.అందుకోసం రక రకాల ప్రయత్నాలు చేస్తారు.క్రీములు వాడటం, డాక్టర్స్ ని కలవడం ఇలా మెరిసే చర్మం కోసం అందరూ కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎంతో ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కొనుక్కొని వాటిని వాడుతుంటారు. ఇక మరికొందరు అయితే బ్యూటీ పార్లర్లకు వెళ్లి తమ అందాన్ని పెంచుకుంటారు. ఇక తాత్కాలికంగా ఉండే అందం కోసం ఎన్నో వారెన్నో కష్టాలు పడుతుంటారు. ఇక ముఖం జిడ్డుగా ఉన్నవారి కష్టాలు గురించి అయితే ఇక ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మార్కెట్లోకి ఏ కొత్త ప్రొడక్ట్ వచ్చిన సరే వారు వాడుతుంటారు. అయితే మన ఇంట్లో దొరికే వస్తువులతోనే అందమైన చర్మాన్ని మనం సొంతం చేసుకోవచ్చు.అలాగే కొబ్బరిపాలు ఇంకా నిమ్మరసం చర్మంపై పూయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి.ఇక ఆరోగ్యకరమైన ఇంకా అందమైన చర్మం కోసం ఒక గిన్నెలో కొబ్బరి పాలు, నిమ్మరసం తీసుకొని వాటిని బాగా కలపండి.
ఇక మిశ్రమాన్ని ముఖం మొత్తం పూసి బాగా మర్దనా చేయండి. అలాగే 20 నుంచి 25 నిమిషాలు దాకా అలాగే ఉంచండి. తరువాత మీ ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోండి. ఇది మీ చర్మం ఆరోగ్యంగా అలాగే మెరుస్తూ కనిపించడానికి సహాయపడుతుంది.ఇక అంతేగాక ఇది మీ ముఖం మీద ముడతలు పోవవడానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది.ఇక అలాగే ముల్తానీ మట్టి, తేనె, నిమ్మకాయతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఒక టీస్పూన్ ముల్తానీ మట్టి, ఒక టీస్పూన్ నిమ్మరసం ఇంకా అలాగే ఒక టీస్పూన్ తేనె వేసి మంచి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇక ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై రాయాలి. అలా ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పాటు ఉండాలి.ఇక ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మీకు చక్కటి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: