బంగాళదుంపతో ఇలా చేస్తే కళకళలాడే అందం మీ సొంతం...

Purushottham Vinay
ఉడికించిన రెండు బంగాళ దుంపలు తీసుకొని వాటిని గుజ్జుగా చేసుకోవాలి. ఆ గుజ్జుకు రెండు చెంచాల పాలు కలిపి మిక్సీలో వేసి మరింత గుజ్జుగా చేయాలి.ఇక ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే దూదితో ముఖానికి బాగా పట్టించాలి. ఒక అరగంట పాటు ముఖాన్ని ఆరనిచ్చి తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం ఎంతో కాంతివంతంగా మారుతుంది. ఒక పచ్చి బంగాళ దుంపను తీసుకొని దానిని గుజ్జుగా చేసుకొని ఆ గుజ్జును గ్లాసు నీళ్ళలో వేసి కలిపి బాగా మరిగించాలి.ఇక తరువాత నీరు పూర్తిగా ఆవిరై పోగా మిగిలిన గుజ్జును వారానికి రెండుసార్లు ముఖానికి రాసుకుంటే చర్మం మీద పడిన మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి.అలాగే ఒక స్పూన్ పచ్చి బంగాళ దుంప తీసుకొని గుజ్జుగా చేసుకున్నాక ఆ గుజ్జుకు ఒకటిన్నర స్పూన్ పంచదార కలిపి మెత్తగా చేసి ముఖానికి బాగా పట్టించాలి.ఇక అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కుంటే మీ ముఖం చాలా అందంగా కాంతివంతంగా ఉంటుంది.పచ్చి బంగాళ దుంపలను తీసుకొని వాటిని క్రష్ చేసి ఆ గుజ్జులో ఒక స్పూన్ తేనె కలిపి పేస్ ప్యాక్‌గా వాడితే ముఖం కాంతివంతంగా ఉంటుంది.


కళ్ల కింద నల్ల మచ్చలను పోగొట్టేందుకు బంగాళదుంప భలే పనిచేస్తుంది. బంగాళ దుంపలను తీసుకొని వాటిని గుండ్రంగా తరగాలి.తరిగిన తరువాత కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత వాటిని కళ్ల కింద ఉంచుకోవాలి. ఇలా రోజూ చేస్తే నల్లమచ్చలు మాయమవుతాయి.అలాగే ఒక స్పూను పొటాటో రసానికి స్పూను ముల్తానీ మట్టిని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పూసుకుని కాసేపు ఆరనీయాలి.ఆరిన తరువాత ముందుగా గోరువెచ్చటి నీటితోనూ, ఆ తరవాత చన్నీటితోనూ కడిగేయాలి.ఇలా బంగాళాదుంపని ఉడకబెట్టి ముద్దలా చేసుకొని ఒక స్పూను పాల పొడి, ఒక స్పూను బాదం నూనె కలిపి ముఖానికి బాగా పట్టించి పావుగంట తరవాత శుభ్రం చేసుకుంటే ఛాయ మెరుగుపడుతుంది.ఇక అలాగే మూడు టేబుల్ స్పూన్ల బంగాళా దుంపల రసం,మూడు స్పూన్ల కలబంద రసం, రెండు స్పూన్ల తేనె తీసుకోండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి రెండు గంటలు ఆరిన తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మీ జుట్లు తళ తళ మెరిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: