ఈ సన్ స్క్రీన్ లోషన్ లతో చర్మం సురక్షితం...

frame ఈ సన్ స్క్రీన్ లోషన్ లతో చర్మం సురక్షితం...

Purushottham Vinay
మనం సాధారణంగా ఎండకి బయటకి వెళ్తూ ఉంటాము. అప్పుడు చర్మం పాడైపోతుంది. అంతేకాకా ఇప్పుడు ఈ ఎండాకాలంలో అయితే బయటకి వెళ్లకపోయినా కాని ఆ వేడికి చర్మం పాడవుతుంది. పైగా ఈ రోజుల్లో చాలా మంది స్మార్ట్ ఫోన్ లకి అడిక్ట్ అయిపోయారు. అంతేగాక కరోనా వల్ల చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కి అలవాటు పడి ఎక్కువ సమయం లాప్ టాప్ ల ముందు గడుపుతున్నారు. అయితే వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల కూడా చర్మం పాడవుతుంది. ఇక చర్మ సంరక్షణకు ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. కాని ఏది పడితే అది కాదు. కేవలం ఇలాంటివే వాడాలి. అవేంటంటే..


కెమికల్ సన్‌స్క్రీన్స్‌లో ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇది కెమికల్ రియాక్షన్ ఇచ్చి హానికరమైన యూవీ కిరణాల నుంచి ప్రొటెక్ట్ చేస్తోంది. చర్మంపై నుండి కూడా వేడిని తగ్గించేస్తుంది. ఇది చాలా పలుచగా ఉంటుంది సులువుగా చర్మంపై అప్లై చేసుకో వచ్చు. అంతే కాకుండా దీనిని ప్రతి రోజు ఉపయోగించవచ్చు. వీటిలో ఎటువంటి కెమికల్స్ ఉంటాయి అంటే... అవోబెంజోనే, ఆక్టిస్లెట్, ఆక్టోక్కేరోలీన్, ఆక్ట్ నొకేసెట్ మరియు సాలిసైలెట్స్.కాబట్టి చర్మ సంరక్షణకు సహాయపడుతుంది.


ఇక ఫిజికల్ సన్‌స్క్రీన్ లోషన్‌ కూడా చర్మాన్ని రక్షిస్తుంది. ఇది హానికరమైన సూర్యకిరణాలు చర్మం మీద పడకుండా కాపాడుతుంది. అవి ఒక ఫిలింలాగా క్రియేట్ అయి హానికరమైన కిరణాలు చర్మం మీద పడకుండా చూస్తుంది. ఇవి కెమికల్‌గా యువి రేస్‌తో రియాక్ట్ అవ్వవు.
ఫిజికల్ సన్‌స్క్రీన్స్‌లో టైటానియం మరియు జింక్ మినరల్స్ ఉంటాయి. వీటిని మినరల్ సన్‌స్క్రీన్స్ అని కూడా అంటారు. ఇవి చర్మంపై ఉండే రంధ్రాలని పూడ్చవు. సెన్సిటివ్ స్కిన్ వాళ్లకి పిల్లలకి కూడా ఇది చాలా మంచిది. దీనిని చర్మం మీద అప్లై చేసిన వెంటనే పని చేస్తుంది అయితే  చెమట కారణంగా ఇది సులువుగా తొలగిపోతుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: