ఫొటాటొ విత్ హ్యాండ్స్ ఫ్యాక్

Durga
 చర్మం ముడతలు పడి వయసు పైబడినట్లు కనిపించేది ముఖం, మెడమీదే కాదు... చేతులు కూడా సరైన సంరక్షణ లేకుంటే మన వయసును ఇట్టే చెప్పేస్తాయి. అందుకే చేతులను కోమలంగా సంరక్షించుకోవాలి. చాలామంది చేతులను నిర్లక్ష్యం చేస్తారు. నీటిలో ఎక్కువగా తడవడం, డీటర్జెంట్ల వాడకం, సూర్యరశ్మి సోకడం తదితర కారణాల వల్ల చేతులపై చర్మం నాజూకుదనాన్ని కోల్పోతుంది.   ఈ పరిస్థితి రాకుండా మనం ఎలాంటి సంరంక్షణ చర్యలు చేపట్టాలో చూద్దాం... రోజులో వీలు చిక్కినపుడల్లా మాయిశ్చరైజర్ రాసుకోండి. నువ్వులు, కొబ్బరి నూనె అయినా శ్రేష్ఠమే ! పాత్రలు తోమడం, బట్టలు ఉతకడం వల్ల, నీటిలో ఎక్కువసేపు నానినా చర్మం బిరుసెక్కిపోతుంది. అందుకే మాయశ్చరైజర్ తప్పనిసరి. పొడిచర్మం ఉన్నవారికి ఇది పెద్ద సమస్యే అందుకే పని చేస్తున్నపుడు గ్లవుసులు తప్పనిసరిగా ధరించాలి. ఉడికించిన బంగాళదుంపలను ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా పాలు కలిపి చేతులకు పట్టించండి. ఫ్యాక్ గట్టిపడిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఓ పదినిమిషాలు తీరకి చేసుకుంటే చేతులకు క్రీమ్ తయారుచేసుకోవచ్చు. వంటింట్లో ఉండే వస్తువులే చాలు. దీనికి ముందుగా టేబుల్ స్పూను తేనెలో మూడు చెంచాలు తాజా వెన్న కలపాలి. దీనికి రోజ్ వాటర్ చేరిస్తే హ్యాండ్ క్రీం సిద్దం. దీనిని వాడితే చేతులు మృదువుగా తయారౌతాయి. చెంచా గ్లిజరిన్, గుడ్లు తెల్లసొన, ఆలీవ్ లేదా బాదం నూనె ఓ చెంచా, కాస్త నిమ్మరసం రోజ్ వాటర్ తీసుకోవాలి. వీటన్నింటిని కలిపి చేతులకు ఫ్యాక్ లా వేసుకుని ఆరిన తర్వాత కడిగేయాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: