కాళ్ళ పగుళ్లు తో ఇబ్బంది పడుతున్నారా?

Divya

శీతాకాలంలో  కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చలి వాతావరణం, పొడి గాలి,తేమ  సరిగ్గా లేకపోవడం,పాదాలకు సంబంధించిన తగిన  జాగ్రత్తలు తీసుకోకపోవడం లాంటి వాటివల్ల తరచూ  పాదాల పగుళ్ళకు గురి అవుతూ ఉంటాయి.  అంతేకాకుండా ఆహారలోపం,పెరుగుతున్న వయస్సుతో పాటు ఎక్కువ సేపు గట్టి నేలపై నిలబడి రావడం లాంటి సమస్యల వల్ల మడమలు పగుళ్ళకు కారణమవుతుంటాయి. మరికొంతమందిలో పాదాల పగుళ్ల ద్వారా రక్తం వచ్చి  చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అంతేకాకుండా పాదాలు పగిలినప్పుడు బయటికి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు చాలా ఉంది. చలి కారణంగా ఈ బాధ విపరీతమైనపుడు  తట్టుకోలేని నొప్పి కూడా వస్తుంటుంది.
డయాబెటిస్తో పాటు థైరాయిడ్ సమస్యలు కూడా పాదాల పగుళ్ళను మరింత పెంచుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో పగిలిన మడమలను సరి చేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు. అయితే కేవలం ఇంట్లోనే పాదాలను మృదువుగా ఎలా  తయారు చేసుకోవాలో? ఇప్పుడు చూద్దాం.
గోరువెచ్చని నీటిలో పాదాలను ఉంచి, కొద్దిసేపటి తర్వాత ఉప్పులో అద్దిన  నిమ్మ తొక్కను పాదాల పగుళ్లపై స్క్రబ్  చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తోపాటు ఇన్ఫెక్షన్ కూడా  తొలగిపోయి, పాదాలు చీలడం లాంటివి జరగకుండా ఉంటాయి.
పాదాలకు తగిన మాయిశ్చరైజింగ్ అందాలంటే  వెజిటేబుల్ ఆయిల్ ను అప్లై చేస్తే మంచిది. ఇందుకోసం ఆలివ్ ఆయిల్,కోకోనట్ ఆయిల్ తోపాటు బాదం నూనె లో ఏదైనా ఒక నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనెల వల్ల కాళ్ళ పగుళ్లు నయం చేయడానికి  సహాయపడతాయి.
అంతేకాకుండా రోజ్వాటర్, గ్లిజరిన్ రెండూ  మిక్స్ చేసి, రాత్రి పడుకోబోయే ముందు పాదాలకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు సాఫ్ట్ గా తయారవుతాయి.
ఆముదం నూనెను రాత్రి పాదాలకు అప్లై చేసి రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయాన్నే వేడి నీటిలో పాదాలు ఉంచి, పది నిమిషాల తర్వాత ఒక క్లాత్ తీసుకుని గట్టిగా రుద్దడం వల్ల అందులో ఉండే మృత కణాలు తొలగిపోయి పాదాలు సాఫ్ట్ గా కనపడతాయి.
వేపాకులను మెత్తగా నూరి అందులో పసుపు కలిపి అప్లై చేసుకోవాలి. వేపాకు లో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు బ్యాక్టీరియాను నివారిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: