అందం: చ‌ర్మ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేసే తుల‌సి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Kavya Nekkanti

ఆరోగ్యంగా ఉండ‌డంతో పాటు అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉండాల‌ని కూడా అంద‌రూ కోరుకుంటారు. కానీ, ప్ర‌స్తుతం వాతావరణం మారింది.  ఇలాంటి వాతావరణంలో జలుబు, దగ్గులతో పాటు చర్మం కూడా బాగా దెబ్బతింటుంది. పొడి చర్మం, మోటిమలు, మచ్చలు ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు వేధిస్తుంటాయి. ఇవి త‌గ్గించుకునేందుకు అనేక ప్రోడెక్ట్స్ ఉప‌యోగిస్తారు. కానీ, స‌మ‌స్య మాత్రం త‌గ్గ‌దు. అయితే చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ, చ‌ర్మ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేయ‌డంలోనూ తుల‌సి గ్రేట్‌గా ప‌నిచేస్తుంది.

 

మ‌రి తుల‌సిని చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. తులసి ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. దీనికి కొంచం నీరు కలిపి ముఖానికి రాసుకోవాలి. పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. అలాగే కొన్ని తుల‌సి ఆకుల‌ను తీసుకుని.. పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో కొద్దిగా రోజ్‌వాట‌ర్ మిక్స్ చేసి ముఖానికి ప‌ట్టించాలి. పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పొడి చ‌ర్మం త‌గ్గి.. ముఖం మృదువుగా మారుతుంది.

 

తుల‌సి ర‌సం తీసుకుని.. అందులో కొద్దిగా శ‌న‌గ‌పిండి, చిటికెడు ప‌సుపు మిక్స్ చేయాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు ప‌ట్టించి.. అర‌గంట త‌ర్వాత  చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల మృత‌క‌ణాలు పోవ‌డంతో పాటు.. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. కొన్ని తుల‌సి ఆకుల‌ను తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో కొద్దిగా పెరుగు, నిమ్మ‌ర‌సం క‌లిపి ముఖానికి ప‌ట్టించాలి. అర గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తూ ఉంటే ముడ‌త‌లు త‌గ్గి.. ముఖం య‌వ్వ‌నంగా మారుతుంది. అదే స‌మ‌యంలో ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: