కుక్కర్లో వండిన ఆహరం ఎంత డేంజ‌రో తెలుసా..!

Bhavannarayana Nch

మీరు అన్నం తినేటప్పుడు ఈసారి ఒక విషయన్ని  గుర్తుపెట్టుకోండి. మీరు తినే అన్నం కుక్కర్లో  వండినదా లేక వేరే గిన్నెలో వండారా అని ఇంట్లో వాళ్ళని అడగండి. కుక్కర్లో వండితే ఆ మెతుకుల పరిమాణంతో పాటు రుచి చుడండి మరుసటి రోజు అదే బియ్యాన్ని వేరే గిన్నెలో..లేక మట్టి పాత్రలో వండించి తినండి..రెండిటికి మధ్య తేడాని గమనించండి. రుచిలో కానీ తిన్నతరువార అరుగుదలలో కానీ..అన్నం పరిమాణంలో చాలా తేడాలు ఉంటాయి..మట్టి పాత్రలో అన్నం తొందరగా అరుగుతుంది. కుక్కర్లో అన్నం ఎందుకు అలా ఉంటుంది ? కుక్కర్లో వండిన అన్నం తినడానికి మంచిదేనా? ఈ విషయాలు తెలుసుకోండి.


సుమారు 3000 ఏళ్ళకు పూర్వం మన భారతదేశంలో జీవించిన మహర్షి వాగ్భటాచార్యులు పొందుపరిచిన ఆయుర్వేద సూత్రాల నుంచి గ్రహించి ఎంతో మంది అనేక రకాల పరిశోధనలు చేసి మన భారతీయుల ఆరోగ్య సంరక్షణకై ఎన్నో అమూల్యమైన విషయాలని మనకి తెలియచేశారు ఆ సూత్రాలలోనిదే ఒకటి ఇది. మనం వండుకుని తినే ఎటువంటి ఆహరం అయినా గాలి ,వెలుతురూ తగిలేవిధంగా వండుకుని తినాలి ఇది మన పూర్వికులనుండి వస్తున్న ఒక ఆహారపు నియమం, అలా కాకుండా గాలి ,వెలుతురూ తగలకుండా తినే ఆహరం విషంతో సమానం ఇది మన శరీరాన్ని స్లో పాయిజన్ లా నాశనం చేస్తుంది. దీనికి మనం నిత్యంవాడే  “ప్రెషర్ కుక్కర్” దీనికి చక్కని ఉదాహరణ.


ఎందుకంటే దీనికి పేరులోనే ఉంది “ప్రెషర్” అని ప్రెషర్ అంటే ఒత్తిడి  అంటే ఆహరం ఒత్తిడికిలోనయ్యి ఆ తరువాత  మెత్తబడుతుంది. అంటే ఉడకడం వేరు మెత్తబడటం వేరు మనం ఆహరం తీసుకునేది శరీరానికి తగినంత పోషకవిలువల ( మైక్రో న్యూట్రియన్స్) కోసం  ఇలా మెత్తబడిన ఆహారంలో పోషకవిలువలు కేవలం 13 శాతం  మాత్రమే ఉంటాయి అంతేగాక ఈ “ప్రెషర్ కుక్కర్” లో వండిన ఆహరం తినడం వలన మధుమేహం, జీర్ణసంబంధిత వ్యాధులు, టిబి, ఆస్తమా, కీళ్ళ వ్యాధులు తప్పకుండా వస్తాయి ఎందుకంటే “ప్రెషర్ కుక్కర్” ని తయారుచేసిది అల్యుమినియంతో.

ఈ అల్యూమినియం  పాత్రలు వండటానికి ,వండిన దానిని నిల్వ ఉంచడానికి పనికి రాదు. అందుకే మన పూర్వికులు పూర్వం వంటలని మట్టిపాత్రలలో వండేవారు ఇలా వండిన ఆహారం లో పోషకవిలువల 100 % ఉంటాయి. కుక్కర్లో వండిన వంటలలో పోషకాలు 13 శాతం మాత్రమే ఉంటాయి. మీరు కూడా కుక్కర్లో వండిన వంటలని కొన్ని రోజులు పక్కన పెట్టి మట్టి పాత్రలలో వండుకుని తినండి.మార్పుని మీరు తప్పకుండ గ్రహిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: