రైల్వేకు ఫుల్ ఆదాయం వచ్చిందట?
ఈ నవంబర్ మాసంలో దక్షిణ మధ్య రైల్వే 93 ప్రత్యేక రైళ్లను 460 ట్రిప్పులు నడిపించింది. మొత్తం 2.82 లక్షల ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. మరో 625 ప్రత్యేక కోచ్ ల ద్వారా 42,757 మంది అదనపు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర వేసింది. ఈ నవంబర్ లో 10.481 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసినట్లు రైల్వే తెలిపింది. గత ఏడాదితో పోల్చితే 15శాతం అదనంగా రవాణా చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.