2047 నాటికి ప్రపంచంలో ఇండియా నెంబర్‌ 1?

Chakravarthi Kalyan
ఇండియా.. అన్ని వనరులు ఉన్న దేశం.. పేదరికం, వలస పాలన కారణంగా వెనుకబడిపోయింది. ఇప్పుడు అన్ని సమస్యలను అధిగమిస్తూ ప్రగతి పథం వైపు పయనిస్తోంది. అయితే.. ఇటీవల అమృత మహోత్సవాలు జరుపుకున్న మన దేశం.. 2047 నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కావాలని కలలు కంటోంది. భారత ఆర్థిక వ్యవస్థ మరో పాతికేళ్లలో 20 ట్రిలియన్  డాలర్లకు చేరుతుందని కేంద్ర ఆర్థిక మండలి ఛైర్మన్  బిబేక్  దెబ్రాయ్ అంటున్నారు.

వచ్చే 25ఏళ్లలో భారత దేశ వార్షిక వృద్ధి రేటు 7 నుంచి 7.5% గా ఉంటే ఇది సాధ్యమవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. అధిక ఆదాయ దేశంగా భారత్ ను నిలిపేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను సూచిస్తూ ఆయన ఓ నివేదక విడుదల చేశారు. దానికి ద కాంపిటేటివ్  రోడ్  మ్యాప్  ఫర్  ఇండియా@100 అని పేరు పెట్టారు. 2047 నాటికి దేశ సగటు వార్షిక ఆదాయం 10వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 2.7 ట్రిలియన్  డాలర్లతో భారత్  ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: