చైనాకు ఇండియా షాక్.. సరిహద్దుల్లోకి యుద్ధ ట్యాంకులు?

Chakravarthi Kalyan
చైనాకు ఇండియా షాక్ ఇవ్వబోతోంది. ఓవైపు తూర్పు లద్దాఖ్‌లో చైనాతో భారత సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లద్దాఖ్‌లో ఇండియా సరిహద్దుల్లో రెచ్చిపోతున్న చైనా సైన్యానికి చుక్కలు చూపించేలా ఇండియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. తూర్పు లద్దాఖ్‌లోని పర్వత ప్రాంతాల్లో మోహరింపు కోసం ఇండియా కొత్త ట్యాంకులను సమకూర్చుకోబోతోంది.

సరిహద్దుల్లో తేలికపాటి యుద్ధ ట్యాంకులను ఇండియా మోహరించబోతోంది. ఇందు కోసం ట్యాంకులను సమకూర్చుకునేందుకు భారత సైన్యం సిద్ధమవుతోంది. ఈ ట్యాంకుల కోసం ఇండియా జొరావర్‌ అనే ప్రాజెక్టును చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కారణంగా ఇండియా ఆయుధ పాటవం పెరుగుతుంది.

ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తిప్పికొట్టడానికీ ఈ తేలికపాటి యుద్ధ ట్యాంకులు వీలు కల్పిస్తాయి. సైన్యం రూపొందించిన ఈ ప్రతిపాదనకు రక్షణ మంత్రిత్వశాఖ వచ్చే నెలలో ఆమోదం తెలపవచ్చు. ఈ నేపథ్యంలో తేలికపాటి యుద్ధ ట్యాంకుల కొనుగోలు అంశం సంచలనంగా మారబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: