గాంధీజీ మాటలను అప్పటి కాంగ్రెస్‌ నేతలు వినలేదా?

Chakravarthi Kalyan
1944 నుంచే కాంగ్రెస్ నేతలు గాంధీజీ మాటలను వినడం మానేశారంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు వారణాశి రాంమాధవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీజి మరణానికి మూడు రోజుల ముందు దేశానికి రాజకీయంగా స్వాధీనత వచ్చిందన్న వారణాశి రాం మాధవ్‌... పూర్తి స్వాతంత్రం దేశానికి రావాలంటే ముందు కాంగ్రెస్‌ ను రద్దు చేయాలని అప్పుడే గాంధీజీ చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను రద్దు చేసి లోక్‌ సేవక్‌ సంఘ్‌ ను ఏర్పాటు చేయాలంటూ గాంధీజీ అప్పట్లో ఓ లేఖ రాశారని వారణాశి రాం మాధవ్‌ అన్నారు.
అయితే 1944 నుంచే గాంధీజీ మాటను కాంగ్రెస్‌ వినడం మానేసిందని వారణాశి రాం మాధవ్‌ అన్నారు. అయితే.. ఇప్పుడు గాంధీ మాటలను ఆచరించే దిశగా కాంగ్రెస్‌ను రద్దు చేయించే పనిలో ఆ పార్టీ నేతలు ఉన్నట్లున్నారని వారణాశి రాం మాధవ్‌ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దేశంలో మహిళలకు గౌరం దక్కాలి తప్ప రక్షణ కాదని, గౌరవం ఉంటే రక్షణ అదే వస్తుందని వారణాశి రాం మాధవ్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: