ఏపీలో ఆ ఉద్యోగులకు రికార్డు స్థాయిలో ప్రమోషన్లు?

Chakravarthi Kalyan
ఏపీలో ఎంపీడీవోలు పండుగ చేసుకుంటున్నారు. పాతికేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు ఎట్టకేలకు వచ్చాయి. దీంతో.. 25 ఏళ్లుగా ఎంపీడీవోలు ఒక్క పదోన్నతికి కూడా నోచుకోని వారి జీవితాల్లో ఆనందం నిండింది. ఉద్యోగుల వేదనను అర్ధం చేసుకొని రికార్డు సంఖ్యలో 237 మందికి జగన్ సర్కారు ఒకేసారి పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో  సీఎం జగన్‌కు ఎంపీడీవోల సంఘం కృతజ్ఞతలు తెలిపింది.

సీఎం జగన్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ కోన శశిధర్, ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డికి కృతజ్ఞతలు  చెబుతున్నామని ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు వై. బ్రహ్మయ్య అన్నారు.  ఇప్పుడు ఈ ప్రమోషన్ల ప్రభావం  పంచాయతీరాజ్‌ శాఖలోని 12 క్యాడర్లకు చెందిన వేలాది మంది ఉద్యోగులకూ ఆనందం ఇచ్చింది. వారికి కూడా ప్రమోషన్లు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: