కేసీఆర్ భ‌య‌ప‌డితే తెలంగాణ వ‌చ్చునా..?

N ANJANEYULU
దేశ‌వ్యాప్తంగా రైతులు పండించిన పంట‌కు  కేంద్రం ఎంత ధ‌ర ఇస్తారో చెప్పండని అడిగిన మాటకు స‌మాధానం  చెప్ప‌లేక ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. కేంద్రానికి పంట‌లు కొన‌డానికి భ‌యం అవుతుంది ఎందుకో అర్థం కావ‌డం లేదు. దాదాపు దేశంలో 12 కోట్ల  రైతులున్నారు. ప్ర‌కృతి ఇచ్చిన‌టువంటి జీవ‌న‌దులు, మేధావులు, శాస్త్రవేత్త‌లున్నారు. బంగారు పంట‌లు పండించే అవ‌కాశం ఉంద‌ని, అవ‌కాశాన్నిఉప‌యోగించుకుంటే దేశాన్ని అభివృద్ధిలో ముందంజ‌లో ఉంచొచ్చ‌ని స్ప‌స్టం చేశారు కేసీఆర్‌.
టీఆర్ఎస్ పార్టీ  ముఖ్య‌మంత్రి, మంత్రి ప‌ద‌వుల కోసం అస‌లు భ‌య‌ప‌డ‌దు అని కేసీఆర్‌ వెల్ల‌డించారు. గ‌తంలో ఎన్నో సార్లు రాజీనామా చేశాం. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా వ్య‌వ‌హ‌రించాను. ప‌ద‌వులు నాకు లెక్క కాదని స్ప‌ష్టం చేశారు. ఒక వేళ కేసీఆర్ భ‌య‌ప‌డితే అస‌లు తెలంగాణ వ‌చ్చునా అని పేర్కొన్నారు. తెలంగాణ రైతులు న‌ష్ట‌పోవ‌ద్దు అని కోరుకుంటున్నా. అదే మా ఆరాటం, మా పోరాటం. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంద‌రూ క‌లిసి ధ‌ర్నాలు చేస్తారా ఎక్క‌డైనా.. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డ చేయ‌లేదు అని వివ‌రించారు. రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రాం కోసం తెలంగాణ‌ మంత్రులు, ఎమ్మెల్యేలు గ‌వ‌ర్న‌ర్‌కు మొర‌పెట్టుకుంటారు అని వెల్ల‌డించారు సీఎం.
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: