తెలంగాణ హ‌క్కుల విష‌యంలో రాజీ ఉండ‌దు : మంత్రి

జిల్లా కేంద్రంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో రూ. 40 లక్షల వ్యయంతో చేప‌డుతున్న అదనపు నిర్మాణ పనులకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ...బండి సంజయ్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. కృష్ణా జలాలపై బండి సంజయ్ వ్యాఖ్యలు అపరిపక్వతతో ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ‌ హక్కులను కేంద్రానికి దారాదత్తం చేయాలన్నట్టుగా బండి సంజయ్ వ్యాఖ్యలున్నాయని ఆరోపించారు.

రాష్ట్రాల మధ్య విభేదాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
గోదావరి నదిపై సమస్యలను పక్క రాష్ట్రాలతో సులభంగా తీర్చుకున్నామ‌ని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు అభ్యంతరాలు లేనివి, తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. కృష్ణా నీళ్లను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నాయని అన్నారు. 511 టీఎంసీల నీళ్ళు తెస్తే బండి సంజయ్ కి సన్మానం చేస్తామంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: