తెల్ల జుట్టు నల్లగా అందంగా మారే సింపుల్ టిప్స్

Purushottham Vinay
తెల్ల జుట్టు నల్లగా అందంగా మారే సింపుల్ టిప్స్...
ఇక ఈ రోజుల్లో జుట్టు బలహీనంగా మారడంతో సహా చిన్న వయసులోనే తెల్ల వెట్రుకలు వస్తున్నాయి. తెల్ల జుట్టు రాగానే చాలా మంది కూడా రంగును వేసుకుంటున్నారు. కానీ దీని వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్(Side Effects) గురయ్యే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్(Cancer) వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని ఖచ్చితంగా చెబుతున్నారు. ఎందుకంటే అందులో వాడే కెమికల్స్ శరీరానికి చాలా ప్రమాదకరం అని తేలింది. ఇక ఎలాంటి కెమికల్‌ లేకుండా జుట్టు నల్లగా మారాలంటే ఖచ్చితంగా ఈ చిట్కాలను పాటించండి.ఇక కరివేపాకులో బయో-యాక్టివ్ పదార్థాలు అనేవి ఉంటాయి. ఇవి జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి. కరివేపాకు అనేది ఖచ్చితంగా తెల్ల జుట్టు సమస్యను దూరం చేస్తుంది.కరివేపాకు పేస్ట్ లేదా కరివేపాకు వేసిన నూనెను తలకు రాసుకోవడం వల్ల తెల్ల జుట్టు నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది.ఇక నిమ్మకాయలో ఉండే మూలకాలు జుట్టును నల్లగా మార్చడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 


ఆయుర్వేదం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే 15 ml నిమ్మరసం ఇంకా అలాగే 20 గ్రాముల జామకాయ పొడిని తీసుకోని..ఇక ఆ రెండింటిని కూడా కలిపి పేస్ట్ లా చేసి తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. అలా కొద్ది రోజులు చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారే అవకాశం చాలా వరకు ఉంటుందట.ఇక హెయిర్ కేర్ నిపుణులు సలహా ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే..తులసి ఆకులలో యాంటీ-ఆక్సిడెంట్లు అనేవి ఎంతో పుష్కలంగా ఉంటాయి. ఇక దీని ప్రభావం అనేది తెల్ల జుట్టును నల్లగా మారేందుకు సహయం చేస్తుంది. నల్లని జుట్టుకు తులసి ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ అనేవి పాటించండి. తెల్ల జుట్టు నుంచి పూర్తిగా ఉపశమనం పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: