టాటూ వేయించుకున్నందుకు అరెస్టు చేశారు.. ఎందుకో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే నిపుణుల పర్యవేక్షణలో టాటూలు వేయించకపోతే మాత్రం అది శరీరానికి చాలా నష్టం కలిగిస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాటూ కూ ఏర్పడిన క్రేజ్ కారణంగా ఎంతో మంది జనాలు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇకపోతే అమెరికాలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. టాటూలు వేయించుకున్నందుకు గాను ఒక కుర్రాడిని, అతని తల్లిని పోలీసులు అరెస్టు చేశారు.. క్రిస్టల్ థామస్ అనే మహిళ అమెరికాలోని న్యూయార్క్ నగరానికి సమీపంలో ఉంటుంది.
తన కుమారుడు సహా మరో సోదరుడితో కలిసి నివసిస్తుంది అయితే పక్కనే గదిలో ఎవరో టాటూ వేయించుకుంటున్నారని వారికి తెలిసింది. దీంతో ఆమె తన కుమారుడిని కూడా అక్కడికి తీసుకెళ్లింది. తర్వాత అక్కడ కొడుకు ఇష్టపూర్వకంగానే టాటూలు వేయించుకున్నాడు. ఈ క్రమంలోనే పాఠశాలకు వెళ్లిన సమయంలో ఆ బాలుడు తన స్కూల్లోని నర్స్ ను తన చేతులకు వాస్ లెన్ రుద్దాలి అంటూ అడిగాడు. అయితే అతని చేతులపై పెద్ద టాటూలు కనిపించడం చూసి నర్స్ షాక్ అయింది. టాటూ వేయించుకుంట సమయంలో తన పక్కన తల్లి లేదు అన్న విషయాన్ని కూడా చెప్పాడు బాలుడు. కానీ చివరికి ఆ బాలుడిని, తల్లిని అరెస్టు చేశారు పోలీసులు. ఎందుకంటే అమెరికాలో 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే టాటూలు వేయించుకోవచ్చు అని చట్టం చెబుతుంది. దీనికి విరుద్ధంగా ప్రవర్తించిన సదరు బాలుడుని ఆమె తల్లిని కూడా అరెస్టు చేశారు పోలీసులు.