ఏథర్ 450ఎక్స్: రేపే విడుదల, పూర్తి వివరాలు?

Purushottham Vinay
ఇక బెంగుళూరుకి చెందిన ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy), భారత మార్కెట్లో ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసినదే.ఇంకా ఇప్పుడు కంపెనీ కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ తమ కొత్త మోడల్ ను రేపు (జూలై 19, 2022వ తేదీన) మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబధించి కంపెనీ ఓ కొత్త టీజర్ ను కూడా విడుదల చేయడం జరిగింది.ఈ ఏథర్ ఎనర్జీ నుండి రాబోయే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న ఏథర్ 450ఎక్స్ (Ather 450X) మోడల్ ఆధారంగానే తయారు చేయడం జరిగింది. అయితే, ఇది పాత మోడల్ కన్నా ఎన్నో రెట్లు కూడా చాలా మెరుగ్గా ఉండబోతోందని కంపెనీ తమ టీజర్ లో వెల్లడించింది. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ కొత్త మోడల్ స్కూటర్ ను ఏథర్ 450ఎక్స్ జెన్3 (Ather 450X Gen) పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది. ఇంకా ఇది ప్రస్తుతం 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కన్నా ఎక్కువ రేంజ్ ను ఆఫర్ చేసే పెద్ద బ్యాటరీ ప్యాక్ ను కూడా కలిగి ఉంటుంది.ఇక ఇంతకుముందు, ఏథర్ ఎనర్జీ తమ ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంగ్-రేంజ్ వెర్షన్‌పై పనిచేస్తోందని కూడా నివేదించబడింది.


ఈ నేపథ్యంలో, కంపెనీ నుండి రాబోయే ఈ కొత్త ఏథర్ 450ఎక్స్ జెన్3 ఎలక్ట్రిక్ స్కూటరే ఈ లాంగ్-రేంజ్ వెర్షన్ అని అంతా భావిస్తున్నారు. ఇంకా అలాగే, ఈ 'లాంగ్-రేంజ్' వెర్షన్ కు సంబంధించి కొన్ని కీలకమైన పత్రాలు కూడా ఆన్‌లైన్‌లో లీక్ చేయబడ్డాయి. ఈ పత్రాలు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన కీలకమైన వివరాలను వెల్లడించడం జరిగింది.ఇక వాటి ఏథర్ ఎనర్జీ పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో రెండు వేరియంట్‌లను పరిచయం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ పత్రాల ప్రకారం, ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంగ్-రేంజ్ వెర్షన్ ప్రస్తుత మోడల్‌కు శక్తినిచ్చే 2.9kWh బ్యాటరీ ప్యాక్‌కు బదులుగా పెద్ద 3.66kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా, ఈ లీక్ చేయబడిన డాక్యుమెంట్‌ ల ప్రకారం అప్‌డేట్ చేయబడిన ఈ 450ఎక్స్ జెన్3 వేరియంట్‌ పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా మొత్తం 146 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని పేర్కొనబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: