గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌: 'ఎస్-ప్రెస్సో' పాస్ అయ్యిందా?

Purushottham Vinay
ఇక ఇండియాలో ఈ చిన్న కార్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థలలో ఒకటి 'మారుతి సుజుకి' (Maruti Suzuki). మన దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన మారుతి సుజుకి ఇండియా మధ్యతరగతి కస్టమర్లను ఆకర్షించడానికి 'మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో' (Maruti Suzuki S-Presso) ను మైక్రో ఎస్‌యువిగా కూడా పరిచయం చేసింది. ఇది హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో విక్రయించబడినప్పటికీ,అచ్చం చూడటానికి ఒక మైక్రో ఎస్‌యువి మాదిరిగానే ఉంది.ఇక మారుతి సుజుకి అమ్మకాల్లో ముందుకు వెళ్తున్నప్పటికీ, భద్రతా విషయంలో మాత్రం చాలా వెనుకబడే ఉంది. దీనికి ప్రధాన కారణం కంపెనీ చిన్న కార్లలో ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ అంతగా లేకపోవడమే. ఇక ఇందులో 'మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో' కూడా ఉంది. ఇది వరకు నిర్వహించిన గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 'మారుతి ఎస్-ప్రెస్సో' ఆశించిన స్థాయిలో భద్రతా ఫీచర్స్ పొందలేదని కూడా నిర్దారించబడింది.


అయితే ఇక ఇప్పుడు మాత్రం మేడ్ ఇన్ ఇండియా మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో మెరుగైన పనితీరును కనబరిచి ఉత్తమ ఫలితాన్ని కూడా సొంతం చేసుకుంది. అలాగే ఈ కారును గ్లోబల్ ఎన్‌సిఎపి తన 'సేఫ్ కార్స్ ఫర్ ఆఫ్రికా ప్రోగ్రామ్' కింద క్రాష్ టెస్ట్ చేయబడింది. అలానే కంపెనీ ఈ ఎస్-ప్రెస్సోను భారతీయ మార్కెట్ నుంచి ఆఫ్రికన్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఇక అంతే కాకూండా అక్కడ కూడా ఈ కారుకు క్రాష్ టెస్ట్ చేయబడుతుంది. ఈ క్రాష్ టెస్ట్ లో ఈ కారు ఇప్పుడు 3 స్టార్ రేటింగ్ కైవసం చేసుకోగలిగింది.ఇంకా అలాగే నివేదికల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే, గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 'సుజుకి ఎస్-ప్రెస్సో' అడల్ట్ సేఫ్టీ విషయంలో 3 స్టార్ రేటింగ్ ఇంకా అలాగే పిల్లల సేఫ్టీలో 2 స్టార్ రేటింగ్ పొందింది. మొత్తం మీద ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ అనేది పొందకపోయినా 3 స్టార్ రేటింగ్ పొంది మునుపటికంటే కూడా మంచి ఉత్తమమైన స్కోర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: