ఇక ఇండియా మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కంపెనీలలో ఒకటి బజాజ్ ఆటో ఒకటని చెప్పాలి. ఈ బజాజ్ కంపెనీ బజాజ్ పల్సర్ సిరీస్ బైక్‌లు ఇండియా మార్కెట్లో విపరీతమైన ప్రజాదరణని పొందడం జరిగింది.ఇక ఇండియాలో పల్సర్ బైక్‌లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అనటంలో ఏ మాత్రం సందేహం అనేదే లేదు. అయితే బజాజ్ కంపెనీ కూడా ఇండియా మార్కెట్లో తన పల్సర్ సిరీస్‌ను మరింత పెద్ద ఎత్తున విస్తరించడానికి ప్రయత్నం చెయ్యాలని చూస్తుంది.ఇక బజాజ్ కంపెనీ నవంబర్ నెలలో పల్సర్ బ్రాండ్ 20 వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతుంది. ఇక ఈ సమయంలో బజాజ్ పల్సర్ కొత్త 250 ఎఫ్ బైక్ లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో బజాజ్ ఆటో కొత్త పల్సర్ ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేయడానికి ఇప్పుడు బాగా రెడీగా ఉంది.ఇక బజాజ్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త పల్సర్ మోడల్ పేరుని ఇంకా వివరాలను కంపెనీ మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది కొత్త 2021 బజాజ్ పల్సర్ 250 గా కంపెనీ తెలిపింది.
ఇక ఈ సంవత్సరం సరికొత్త పల్సర్ మోడళ్లను విడుదల చేయడానికి కంపెనీ అనేక ఏర్పాట్లు చేస్తోంది. దేశీయ మార్కెట్లో ప్రాక్టికల్ ఇంకా ఎఫెక్టివ్ మోడల్స్ ఉత్పత్తి చేయడానికి బజాజ్ తన ప్రత్యేకమైన ఈవి సబ్-బ్రాండ్‌ను వాడుతుంది.ఇక బజాజ్ ఆటో ఇండియా మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్లు, త్రీ వీలర్స్ ఇంకా 4 చక్రాలను అమ్మాలని ప్లాన్ . అయితే తరువాతి కంపెనీ కమర్షియల్ విభాగంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయబోతుంది. ఇక ఈ సంవత్సరం జూలై నెలలో, EV ల అభివృద్ధి కోసం బ్రాండ్ కొత్త సబ్-బ్రాండ్ కోసం సైన్ అప్ చేయడం జరిగింది.ఇక బజాజ్ ఆటో తన కొత్త పల్సర్ 250 బైక్‌ను వచ్చే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. బజాజ్ తన పల్సర్ సిరీస్ బైకుల కోసం పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇక ఈ సరికొత్త పల్సర్ 250 బైక్ కొత్త ప్లాట్‌ఫామ్ కింద ప్రారంభమవుతుందట.