సిట్రోయెన్ నుంచి అదిరిపోయే కాంపాక్ట్ ఎస్యూవి.. ఎప్పుడంటే..?

Purushottham Vinay
ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ ఇప్పుడు ఎస్‌యూవీలకు మంచి హబ్‌గా మారిపోయింది. ఇప్పటికే మన మార్కెట్లో అనేక కొత్త ఎస్‌యూవీ కార్ లు అందుబాటులోకి రాగా, ఇక రానున్న రోజుల్లో కూడా మరిన్ని కొత్త ఎస్‌యూవీ కార్ లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. ఇక వీటిలో ఒకటి ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ నుండి రాబోయే కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్.ఇక ఈ కొత్త ఎస్‌యూవీ కార్ ని సిట్రోయెన్ సి5 (కోడ్‌నేమ్ - సిసి21) పేరుతో ప్రవేశపెట్టవచ్చని సమాచారం అందుతుంది. ఇక వచ్చే సంవత్సరం ఇది ఇండియా మార్కెట్లో విడుదల కావచ్చని భావిస్తున్నారట.కాగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, సిట్రోయెన్ ఈ చిన్న ఎస్‌యూవీ కార్ ని సెప్టెంబర్ 2021లో ప్రపంచవ్యాప్త ఆవిష్కరించేందుకు సన్నాహాలని సిద్ధం చేస్తోంది.ఇక సిట్రోయెన్ కార్ ప్రస్తుతం ఇండియా మార్కెట్లో సి5 ఎయిర్‌క్రాస్ అనే ఎస్‌యూవీని మాత్రమే సేల్ చేస్తుంది.అయితే, కంపెనీ ఇండియన్ రోడ్లపైన సి3 (సిసి21) అనే మరో చిన్న ఎస్‌యూవీ కార్ ని విస్తృతంగా పరీక్షిస్తుండటం జరిగింది.ఇక ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ ని కంపెనీ కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించవచ్చని సమాచారం అందుతుంది.

ఇక ఈ ఎస్యూవి కార్ ప్యూజో 208 డిజైన్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుందట.ఇక ఈ డిజైన్ ప్లాట్‌ఫారమ్ ప్రత్యేకత ఏమిటంటే, దీని ఆధారంగా ఎస్‌యూవీలు కార్లు , ఎమ్‌పివిలు, సెడాన్లు ఇంకా హ్యాచ్‌బ్యాక్‌ కార్ లను తయారు చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ పెట్రోల్ ఇంకా డీజిల్ ఇంజన్‌లనే కాకుండా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లను కూడా బాగా సపోర్ట్ చేస్తుంది.అలాగే స్పాట్ టెస్ట్‌లో కనిపించిన చిత్రాలను బట్టి చూస్తుంటే, ఈ సి3 మోడల్ డిజైన్ అనేది చూడటానికి ఇంచుమించుగా దాని ముందు మోడల్ అయిన సి5 ఎయిర్‌క్రాస్ లాగానే అనిపిస్తుంది.ఇక ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అలాగే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు ఇంకా వ్రాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్స్ అలాగే అండర్ బాడీ క్లాడింగ్ వంటి డిజైన్ అంశాలను ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ లో మనం గమనించవచ్చు. ఇక ఈ కారులో ఎల్ఈడి హెడ్‌లైట్లు అనేవి బంపర్‌లపై అమర్చబడి ఉంటాయి. ఇంకా వాటి పైభాగంలో ఈ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు కూడా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: