BMW నుంచి త్వరలో రాబోతున్న కొత్త మోడల్..

Purushottham Vinay
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ bmw గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.చాలా మందికి bmw కార్లు సొంతం చేసుకోవడం డ్రీమ్ అని చెప్పాలి. అంతలా ఆకట్టుకుంటాయి bmw కార్లు.ఇక ఈ జర్మన్ కంపెనీ ప్రపంచ మార్కెట్లో ఎప్పటికప్పుడు తమ వాహనాలను విడుదల చేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల బీఎండబ్ల్యూ 2 సిరీస్ కూపే ఎలా ఉండబోతుందో ఒక టీజర్ విడుదల చేసింది. ఈ మోడల్ డిజైన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక ఈ మోడల్ 6 సిలిండర్ ఇంజన్ కలిగి ఉండటమే కాకుండా మంచి అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ కూపే ప్రొడక్షన్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.ప్రస్తుతం చివరి దశలో ఉంది.

దీని కారణంగా దాని డైనమిక్ టెస్టింగ్ మరియు డ్రైవ్ ఇంకా ట్యూనింగ్ ఆఫ్ సస్పెన్షన్ కూడా రేస్ట్రాక్ స్థితిలో ఉంది. ప్రస్తుతం ఇందులో వీల్ సస్పెన్షన్, చాసిస్, డంపింగ్, స్టీరింగ్ మరియు బ్రేకింగ్ సిస్టమ్ వంటి టెస్టింగ్స్ జరుగుతున్నాయి. అన్ని డ్రైవ్‌లు మరియు చాసిస్ లను పూర్తిగా పరీక్షించడం ద్వారా అన్ని పరిస్థితులలోనూ ఇంజిన్ పనితీరును సులభంగా నియంత్రించగలరని కంపెనీ తెలిపింది.ఇది ఇంజిన్ 374 బిహెచ్‌పి పవర్ మరియు 8 స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్ మోడల్‌లో ఎక్స్‌డ్రైవ్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది.ఇది ఇన్-లైన్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో బిఎమ్‌డబ్ల్యూ ట్విన్ టర్బో టెక్నాలజీతో అమర్చబడి వుంది.ఇందులో సెల్ఫ్ స్టీరింగ్ సిస్టమ్ కూడా ఉందట. ఖచ్చితంగా అది డ్రైవర్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ మోడల్ కి ఎమ్ వెర్షన్ కూడా లభిస్తుంది. కావున ఇది ఎమ్240ఐ ఎక్స్ డ్రైవ్ అయ్యే అవకాశం ఉంటుంది.ఇక దీని ధర ఇంకా పూర్తి వివరాలను కంపెనీ త్వరలో వెల్లడించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: