టాప్ బ్యానర్లను ముంచేస్తున్న ప్రముఖ దర్శకులు.. నష్టాల లెక్కలు షాకిస్తున్నాయిగా!

Reddy P Rajasekhar

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు స్టార్ దర్శకుడు సినిమా తీస్తున్నాడంటే అది మినిమం గ్యారెంటీ ప్రాజెక్ట్ అని ఇండస్ట్రీ మొత్తం నమ్మేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. అగ్ర దర్శకులు పెద్ద పెద్ద బ్యానర్లను భారీ నష్టాల్లోకి నెట్టేస్తుండటం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కే పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడటంతో ఆ ప్రభావం నేరుగా నిర్మాతల మీద పడుతోంది. భారీ రెమ్యునరేషన్లు, షూటింగ్ ఆలస్యం కావడం వల్ల పెరిగే వడ్డీలు, విజువల్ ఎఫెక్ట్స్ కోసం చేసే అదనపు ఖర్చులు వెరసి సినిమా బడ్జెట్‌ను అంచనాలకు మించి పెంచేస్తున్నాయి. తీరా సినిమా థియేటర్లలోకి వచ్చాక ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోవడంతో నిర్మాతలు రోడ్డున పడే పరిస్థితి వస్తోంది.

కొందరు దర్శకులు తమ విజన్ పేరుతో అనవసరమైన ఖర్చు చేయించడం, స్క్రిప్ట్ విషయంలో పట్టు కోల్పోవడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని పెద్ద సినిమాలు డిజాస్టర్లుగా మిగిలి దాదాపు 50 నుంచి 100 కోట్ల వరకు నష్టాలను మిగిల్చాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పేరున్న బ్యానర్లు సైతం ఈ దెబ్బకు తట్టుకోలేక తలలు పట్టుకుంటున్నాయి. కేవలం క్రేజ్ ఉంది కదా అని గుడ్డిగా దర్శకులను నమ్మడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హీరోల ఇమేజ్, దర్శకుల బ్రాండ్ వాల్యూ చూసి బిజినెస్ అయితే జరుగుతోంది కానీ, ప్రేక్షకుడిని మెప్పించే కంటెంట్ లేకపోతే ఎంతటి దిగ్గజ దర్శకుడైనా నిర్మాతను ముంచేయడం ఖాయమని వరుస పరాజయాలు నిరూపిస్తున్నాయి. సినిమా మేకింగ్‌లో దర్శకుల ఆధిపత్యం పెరగడం, బడ్జెట్ నియంత్రణ లేకపోవడం వంటి కారణాలు అగ్ర నిర్మాణ సంస్థలను సైతం కుదేలు చేస్తున్నాయి. ఈ నష్టాల లెక్కలు చూస్తుంటే రాబోయే రోజుల్లో బడా నిర్మాతలు కూడా స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: