ఒకవేళ మనకు ఇల్లు లేకపోతే వేరే వారి ఇంటిలో అంటే డబ్బులు చెల్లించి నివాసిస్తాం, అలాగే కరంటు వాడిన దానికి బిల్లు చెల్లిస్తాం. అయితే ఈ క్రమంలో ఓ కన్నతల్లి తన బిడ్డను పెంచుతున్న అందుకు ఆ బిడ్డ నుండి డబ్బులు వసూలు చేస్తోందట. ఇంటికి బిడ్డ వయసు ఎంతో తెలుసా. 5 సంవత్సరాల బిడ్డ నుండి వారానికి 5 డాలర్లను రెంట్ కింద వసూలు చేస్తోంది. అవును, మీరు విన్నది నిజమే.
ఈ సంఘటన అమెరికాలో దేశం లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే ఆమె పేరు ఎస్సెన్స్ ఇవాన్స్, ఈమెకు 5 సంవత్సరాలు కలిగిన కూతురు ఉంది. అయితే తన కూతుర్ ని తాను పెంచుతున్నందుకు ఆమె వద్దే ఎస్సెన్స్ 5 డాలర్ల రెంట్‌ను వారానికి ఒకసారి తీసుకుంటోంది. వినడానికి షాకింగ్‌గా ఉన్నా మేం చెబుతోంది నిజమే. ఎస్సెన్స్ తన కూతుర్ని పెంచిపోషిస్తున్న అందుకు వారానికి మొత్తం 5 డాలర్లను తన 5 ఏళ్ల కూతురి నుంచి రెంట్గా తీసుకుంటోంది.
అయితే కన్నతల్లి ఎస్సెన్స్ ఇలా ఎందుకు చేస్తుందో తెలుసా..? కూతురికి చిన్నతనం నుండే డబ్బు పొదుపుపై అవగాహన కల్పించడం కోసం ఇలా చేస్తుందట. ఈ సందర్భంగా మనకొక అనుమానం రావాలి అదేంటంటే అంత చిన్న పాపకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయని, చిన్న పాపకు వారానికి ఏడు డాలర్లు వస్తాయట. అందులో నుంచే 5 డాలర్లను ఆమె తల్లి ఎస్సెన్స్ తీసుకుంటుంది.
ఇక ఆ డబ్బును ఇచ్చేది ఆ పాప తల్లి ఎస్సెన్సే. అవును, ఇది మరీ షాకింగ్ గా లేదూ. మొత్తం మీద చిన్న పాపతో వారానికి రెండు డాలర్లు పొదుపు చేస్తుంది కన్నతల్లి. ఈ క్రమంలో ఎస్సెన్స్ తాను చేస్తున్న పనిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా కొందరు ఎస్సెన్స్ కొంతమంది పొగిడారు మరికొంత మంది విమర్శించారు. ఈ క్రమంలో మరికొంతమంది అంత చిన్న వయసులో ఆర్థిక వ్యవహారాలు గురించి చెప్పిన అర్థం కాదని అంటున్నారు.