పిల్లలే పెరిగే కొద్దీ తల్లి మాట ఎందుకు వినరో తెలుసా ?
అంతేకాదు పిల్లలు తమకి 13 ఏళ్లు వచ్చే సరికి వారి తల్లి స్వరం కటువుగా, అసౌకర్యంగా భావించవచ్చునని, అంటే "పుట్టినప్పుడు తల్లి స్వరంతో ఎలా ట్యూన్ అయ్యేవారో, అలాగే కౌమార దశ వచ్చే సమయానికి వేరే స్వరాలకు ట్యూన్ అవడం జరుగుతుంది. అంతేకాదు పిల్లలకు యుక్త వయసులో స్నేహితులు, కొత్త సహచరులు ఉండటంతో వారితో టైమ్ గడపాలి అని అనుకుంటారట.. అలాగే టీనేజ్ మెదడు గల వారు వినే అన్ని స్వరాలకు ఎక్కువ గ్రహణ శీలత కలిగి ఉండటంతో ఈ వయస్సులో రివార్డ్ సర్క్యూట్ కు సంబంధించిన మెదడు కేంద్రాలు ముఖ్యమైన ఉద్దీపనలకు ప్రాధాన్యతనిచ్చే మార్పులు జరుగుతుంటాయి.
అందులో బాగంగానే బిడ్డలోని ఈ మెదడు ప్రాంతాలు తల్లి స్వరం కంటే తెలియని స్వరాలకు ఎక్కువ ప్రతిస్పందిస్తాయని తెలుస్తోంది. అయితే టీనేజర్లు ప్రపంచంతో ఎక్కువగా సంబంధం ఏర్పరుచుకోడానికి ఈ మార్పు సహాయపడుతుందని, అలాగే బయట సామాజిక నైపుణ్యం ఏర్పరచుకోవడంలో వారికి సహాయపడుతుందని వివరించారు పరిశోధకులు.