కార్పొరేట్ అందం : విశ్వసుందరి వెనుక.. కధ..!
మనసు లో అందం ఉంటె, అప్పుడు శారీరికంగా కూడా చూడటం మొదలు అవుతుంది. మనసు మంచిదే అనుకుంటే, దాని వలన శరీరం కూడా అలాగే ఉంటుంది కాబట్టి, అందానికి మూలం ఇక్కడ మనసు మాత్రమే. అది గతంలో బాగా ఉండేది. ఎప్పుడైనా కాస్త శాంతి లోపిస్తే, ఇంట్లో ఎక్కువ జనాలు(అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు) ఉంటారు కాబట్టి ఒకరు కాకపోతే ఇంకొకరు పట్టించుకునేవారు. దానితో మనసు భారం తిరి, సమస్యకు కూడా పరిష్కారం వచ్చేస్తుంది. దానితో మళ్ళీ ఆ మనిషి మనసు మాములు స్థితికి వచ్చేస్తుంది. వాటితో పాటుగా సౌందర్యకరకాలు అనేకం వంటింట్లో(పసుపు, షీకాయ తదితరాలు) ఉండేవి, వాటితో శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకునే వారు. ఇది పూర్తిగా అందంగా తయారవడానికి సహకరిస్తుంది.
అప్పుడు కనీసం తలారా స్నానం చేద్దాం అంటే కుంకుళ్ళు కొట్టుకొని, దానిని వేడి నీళ్లలో కాసేపు నానపెట్టి, వాటిని ఒకరు తలపై పోసి రుద్దుతుంటే వెంట్రుకల మోడళ్ళు సహా నెత్తి శుభ్రం అవుతుంది. దానికి ఒక మనిషి కుంకుళ్ళు కొట్టడం, మరో మనిషి నానబెట్టడం, ఒకరు స్నానాల గదిలో నెత్తిపై ఆ కుంకుడు రసం పోసి రుద్దటం చేసేవారు. ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీ కదా, అలాంటివి కష్టం అందుకే, కార్పొరేట్ షాంపూ లు వాడేస్తున్నాం. అవన్నీ రసాయనాలు కాబట్టి అందుకు మరో రసాయనం, దాని ప్రభావం పోవడానికి మరో రసాయనం. ఇలా ఎన్నో రసాయనాలకు అలవాటుపడిపోయాం. పొద్దున్న టూత్ పేస్ట్ నుండి పడుకునే ముందు నిద్రపట్టడానికి వాడే మందు వరకు అన్ని రసాయనాలే(కార్పొరేట్).
ఇవన్నీ పెద్దగా భారతీయులకు పరిచయం లేదు, కానీ దేశంలో ఎప్పుడైతే ప్రపంచ సుందరిని గెలిచిందో, వాళ్ళతో కార్పొరేట్ యాడ్స్ వచ్చాయి. దానిని చూసిచూసి ఇన్స్టెంట్ వైపు అందరి చూపు పోయింది. ఒంటరి పరిస్థితికి అంతకన్నా దారి కూడా లేదనుకోండి. ఇప్పుడు మళ్ళీ భారత్ ప్రపంచ సుందరి కిరీటం గెలిచింది అని సంతోషపడాలో, మళ్ళీ తీవ్రంగా కార్పొరేట్ యాడ్స్ ఎక్కువ అయిపోతాయని బాధపడాలో తెలియడం లేదు. స్వదేశీ అన్న సమయంలో ఈ ఫలితం విజయం అవుతుందా, కార్పొరేట్ చొరబాటు అవుతుందా! దేశీయ సౌందర్యకరకాలు కూడా ఉత్పత్తి ఇప్పుడిప్పుడే జరుగుతుంది, వాటిని వాడాల్సిందిగా ఈ ప్రపంచ సుందరి ప్రచారం చేస్తే బాగుంటుంది. స్వదేశీ శక్తి దేశానికి ఇప్పుడు చాలా అత్యవసరం. లేనిపోని హంగులు చూసి, మళ్ళీ విదేశీ వైపు దృష్టి మళ్ళించకండి.