గర్భీణీల ఏ ఆహారం తింటే మంచిది.. ఫుడ్ లో అవి తప్పనిసరి..!

N.ANJI
గర్భంలో ఉన్నప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకూ..గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తినాలి, ఫుడ్ డైట్ ఎలా పాటించాలో ఇప్పుడు ఫటాఫట్ తెలుకుందాం..!
రోజుకు విభిన్న రకాల పండ్లతో ఐదు సార్లైనా జూస్ తీసుకోవాలి. కూరగాయలతో తయరుచేసిన జ్యూస్ కూడా తీసుకోవటం కూడా మంచింది. కూరగాయలను స్ట్రీమింగ్ చేసినవి తింటే మరీ మంచిది. కూరగాయలను ఉడికించి తినటం వల్ల వాటిల్లో ఉండే విటమిన్స్ శరీరానికి బాగా చేరుతాయి. ఐరన్, క్యాల్షియం ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రాగి శరీరానికి చాలా మంచింది. శరీరానికి చలవ చేస్తుంది. రాగిజావను రోజుకు ఒక్కసారైనా తీసుకోవాలి. ఓట్స్ తో ఉప్మాలా చేసుకుని తిన్నా మంచిదే.
శిశువుకు 14వ వారం నుంచి ధైరాయిడ్ గ్రంధి పని చేయటం ప్రారంభిస్తుంది. ఈ గ్రంధులు పనితీరు మెరుగుపరచటానికి ఐయోడిన్ చాలా అవసరం. సముద్రపు చేపలు, తృణధాన్యాలు, పప్పు దినుసుల్లో ఐయోడిన్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా మనకు దొరికే ఉల్లిపాయలు, ఆకుకూరల్లో పాలకూర, పుట్టగొడుగులు( మష్ రూమ్స్), కోడిగుడ్డులోనూ మనకు ఐయోడిన్ దొరుకుతుంది.
రెండో దశ అంటే మూడు నెలల నుంచి బరువు పెరగటం ముఖ్యం. గర్భిణీలు తొమ్మిదినెలల అయ్యేసరికి  10కేజీలు నుంచి 12.5 కేజీలైనా బరవు పెరగాలి.  బరువు పెరగటంకోసం పౌష్టికాహారం తీసుకోవాలి, ప్రోటీన్లు, పండ్లు, కూరగాయాలు,  కార్బోహైడ్రేట్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వాల్ నట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. గుండెకు మేలు చేస్తాయి. సోయాబీన్స్, తాజా ఆకుకూరలు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అందువల్ల శిశువకు మెదడు, కళ్లు అభివృద్ధి చెందటానికి సహకరిస్తాయి. ఇంకా నువ్వుల్లో కూడా ఒమేగా 3 యాసిడ్లు పుష్కలంగానే ఉంటాయి. ఇక స్నాక్స్ గా డెట్స్, యాపిల్, ఊతప్పం వంటివి తీసుకోవటం మంచిది.
గర్భీణీలు తమ ఫుడ్ డైట్ లో ఇవన్నీ ఉండేలా చూసుకుంటే పట్టబోయో బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: