రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది జగమెరిగిన సత్యం. పెద్దపెద్ద నాయకులు వారి రాజకీయ అవసరాల కోసం పార్టీలు మారుతూ వారి భవిష్యత్తును వారే చూసుకుంటారు. కార్యకర్తలు మాత్రమే పార్టీలు, జెండాలు అంటూ ఒకరినొకరు కొట్టుకొని చంపుకునే స్థాయికి ఎదుగుతారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ముగిసాయి. రెండు పార్టీల మధ్య ఓరాహోరీ పోరు సాగింది. కానీ ఇందులో ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు అధికారంలోకి వస్తారు అనేది జూన్ నాలుగో తేదీన తెలుస్తుంది. అలాంటి ఈ తరుణంలో మొన్నటి వరకు ఎలక్షన్స్ కోసం వైసిపి, టిడిపి పార్టీలకు సంబంధించి కార్యకర్తలు విపరీతంగా కొట్లాడుకున్నారు. ఒకే ఊరికి చెందిన వ్యక్తులంతా పార్టీల కోసం కొట్లాడుకొని విపరీతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలక్షన్ అయిపోయయి రిజల్ట్ వస్తుంది, ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది.
ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చే నాయకుడు ఉండడు. కానీ కొట్టుకున్న మీరిద్దరూ పొద్దున లేస్తే ఒకరి మొహం ఒకరు చూసుకోవాలి. అలాంటి ఈ తరుణంలో ఈ కొట్లాటలు, ఫైటింగ్ లు ఎందుకని కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోని ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ మరియు జగన్మోహన్ రెడ్డి పాత వీడియోలను కలిపి ఒక అద్భుతమైన వీడియోను ఎడిటింగ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ మరియు జగన్మోహన్ రెడ్డి ఒక నాణానికి రెండు వైపులా ఉండే వ్యక్తులు. వారు పెరిగిన వాతావరణం వారికి ఉండే అభిరుచులు, వ్యక్తిత్వాల మధ్య చాలా డిఫరెంట్ ఉంటుంది.
ఒకరు మాజీ ముఖ్యమంత్రి కొడుకైతే మరొకరు కానిస్టేబుల్ కొడుకు. ఒకరు సినీ ఫీల్డ్ కు చెందిన వారైతే మరొకరు రాజకీయాలకు చెందినవారు. ఇద్దరికీ ఏ విషయంలో కూడా కలిసే అభిరుచులు లేవు. అంతే కాదు ఇద్దరు కూడా రాజకీయంగా ప్రత్యర్థులయ్యారు. ఎలక్షన్స్ అయిపోయాక ఈ మ్యాటర్ గురించి ఎందుకని మీరు అనుకుంటున్నారు కదూ. ఇప్పుడే వీరి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైసిపి పార్టీకి చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా, పవన్ జగన్ మ్యూచువల్ ఫ్యాన్ అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. దీనిపై జగన్, పవన్ అభిమానులు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. పవన్ జగన్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారా.
ఉంటే ఈ వీడియో చూసి స్పందించండి అంటూ ఖతర్నాక్ వీడియోని తయారు చేసి అభిమాని పోస్ట్ చేశాడు. ఈ వీడియో పై జగన్ పవన్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏపీలో ఇలాంటి మ్యూచువల్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. దానివల్లే పవన్ ఎప్పుడు ఓడిపోతూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇస్తాం కానీ, రాజకీయంగా మాత్రం జగనన్నకే ఓటేస్తామని డైలాగులు చెబుతూ ఉండే ఫ్యాన్స్ ఏపీలో ఎక్కువమంది ఉన్నారు. అందుకే పవన్ కు అంత మంది అభిమానులు ఉన్నా కానీ, రాజకీయాల్లో మాత్రం సెట్ అవడం లేదు. దీన్ని బట్టి చూస్తే మాత్రం సినిమా సినిమానే, రాజకీయం రాజకీయం అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తోంది.