వైసీపీ విక్టరీ: అనంతలో మళ్ళీ అనంతేనా.?

Divya
•అనంతపురంలో మళ్లీ అధికారంలోకి వైసీపీ
•ఫ్యాన్ దెబ్బకి సైకిల్ పంక్చర్
* అనంతపురంలో మళ్లీ అనంత వెంకట్రామిరెడ్డిదే హవా..
(రాయలసీమ - ఇండియా హెరాల్డ్)
ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికలు మే 13వ తేదీతో ముగిసిపోయాయి.. అయితే ఇప్పటికీ కొన్నిచోట్ల మంటలు మాత్రం ఆరలేదని చెప్పాలి.. అటు వైసిపి ఇటు కూటమి అంటూ అభ్యర్థులు ఒకరికొకరు దూషించుకుంటూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో అయితే వైసిపి వర్సెస్ టిడిపి అంటూ నాటు బాంబులతో చెలరేగిపోతున్నారు. మరికొంతమంది విచక్షణారహితంగా ఇళ్లల్లోకి దూరి మరీ ఓటర్లను హింసిస్తున్నారు.. గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు భయాందోళనలకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరొకవైపు అధికార పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతున్నాము అంటూ మళ్ళీ వైసిపిదే విక్టరీ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా అనంతపురం కంచుకోటగా మారిన వైసిపి ఇప్పుడు మళ్లీ వారిదే హవా అన్నట్టు తెలుస్తోంది. అనంతపురం అర్బన్ నుంచి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంత వెంకట్రాంరెడ్డి పోటీ చేస్తూ ఉండగా.. టిడిపి తరఫున దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పోటీ చేస్తున్నారు.. ఇకపోతే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నాన్ లోకల్ కావడంతో ఈయనపై విమర్శలు ఎక్కువవుతున్నాయి.. అంతేకాదు అనంతపురం అర్బన్ నుంచి టికెట్టు ఆశించిన కొంతమంది టిడిపి నేతలు తమకు టికెట్ దక్కలేదని భంగపడ్డారు..అందుకే  ఈయనకు ప్రచారాలలో సపోర్టు కూడా చేయలేదు. పైగా కొత్త వ్యక్తి కావడంతో ప్రజలు ఈయనకు ఓటు వేసే అవకాశం చాలా తక్కువగా కనిపించింది..
మరొకవైపు అనంత వెంకట్రామిరెడ్డి విషయానికి వస్తే.. నామినేషన్ లోనే వందలాది మంది ప్రజలతో వెళ్లి నామినేషన్ వేసిన ఈయనకు మళ్లీ పట్టం కట్ట బోతున్నారు.. భారీ మెజారిటీతో ఈసారి అనంత వెంకట్రామిరెడ్డి మళ్ళీ అనంతపురంలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురం అర్బన్ ఇప్పటికే అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తోంది.. ఎక్కడ చూసినా అనంతపురం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.. సిటీ లెవెల్ లో అనంతపురంను తీర్చిదిద్దిన అనంత వెంకట్రాంరెడ్డికే మళ్లీ ఓటు వేసి గెలిపించుకోవాలని ప్రజలు తాపత్రయపడుతున్నారు. అందులో భాగంగానే ఆయనను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఏది ఏమైనా ప్రజలు పూర్తిస్థాయిలో వైసీపీకే మద్దతు పలుకుతున్నట్లు సమాచారం.. ఇక అనంతపురం అర్బన్ మళ్లీ వైసీపీ ఖాతాలో చేరినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: