అప్పుడు మిస్ అయిన కాంబో.. ఈ సినిమాతో ఫిక్స్ అయింది..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కి టాక్సీవాలా సినిమా తర్వాత ఆ రేంజ్ లో హిట్ మళ్లీ అందుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇటీవల ఖుషీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో యావరేజ్  హిట్ అందుకున్నాడు. అయితే ఎంతో కాలంగా మంచి హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. దీనికోసం దానికి తగిన విధంగానే కసరత్తులు కూడా చేస్తున్నాడు. అయితే తాజాగా ఇప్పుడు కొంచెం రూటు మార్చిన విజయ్ దేవరకొండ

 డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే గౌతం తిన్ననూరి దర్శకత్వంలో అలాంటి ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా చాలా వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా విజయ్ దేవరకొండ సినీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు

 మరోవైపు దిల్ రాజు బ్యానర్లు సైతం విజయ్ దేవరకొండ మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రాజావారు రాణివారు తో డీసెంట్ సక్సెస్ అందుకున్న రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక రూరల్ యాక్షన్ డ్రామా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవిని  ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినికిడి. గతంలో ‘డియర్ కామ్రేడ్’ మూవీలో సాయి పల్లవి.. విజయ్ కి జోడీగా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమాలో లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని ఆమె నో చెప్పినట్లు టాక్ నడిచింది. దీంతో రష్మికతో ఆ ప్రాజెక్టు ఫినిష్ చేశారు మేకర్స్.  అప్పుడు మిస్ అయిన పెయిర్ ఇప్పుడు ఫిక్స్ అయ్యేలా కనిపిస్తుంది. దిల్ రాజు అయితే సాయి పల్లవి డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: