ఈ నవ్వుల వెనక భరించలేని కన్నీటి కష్టం ఉంది

Mamatha Reddy
అరేంజ్ డ్ మ్యారేజ్ లలో చాలా వరకు ప్రేమ ఉండదు ఏదో సర్దుకుని కలిసి జీవిస్తూ ఉంటారు అని చాలామంది అభిప్రాయం కానీ నిజానికి ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో చెప్పలేము. కొంతమంది పెళ్లి మండపం లో తొలిచూపులోనే పెళ్లి కూతురితో ప్రేమలో పడతాడు పెళ్లి కొడుకు. కొంతమంది పెళ్లిచూపులు సమయంలోనే అమ్మాయితో ప్రేమలో పడతారు. ఇంకొంతమంది పెళ్లి జరిగాక రోజులు గడుస్తున్న కొద్దీ ప్రేమలో పడతారు.  ఏదైనా ప్రేమలో మారడం మాత్రం కచ్చితంగా జరుగుతుంది అరేంజ్డ్ మ్యారేజ్ లో.

అలా పెళ్లి పై కోటి ఆశలు పెట్టుకొని ఓ యువకుడిని పెద్దలు కుదిర్చిన వివాహం గా చేసుకుంది ఓ యువతి. తన తల్లి తండ్రి తనకు ఏదైనా మంచి చేస్తారనే నమ్మకం తోనే అమ్మాయి వాళ్ళు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అత్తింట్లో  అడుగుపెట్టింది.  ఉమ్మడి కుటుంబం కొత్త ప్రపంచంలో అందరితో కలిసి పోవడానికి ప్రయత్నించింది.  మంచి కోడలు అనిపించడానికి తను చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఈ క్రమంలోనే ఆమె నెల తప్పింది. అపురూపంగా చూసుకున్నారు. 9 నెలలు నిండిన తరువాత ఒక బిడ్డ పుట్టాక అంతా తలకిందులైంది. తన తప్పు లేకపోయినా అత్తగారు చీటికిమాటికి తిట్టేవారు. తను చేసిన అతి పెద్ద తప్పు తన కడుపున ఆడపిల్ల పుట్టడమే.

తన భార్యని అవమానించడం ఆ భర్త భరించలేకపోయాడు. ఆమెను ఎలా ఓదార్చాలో అర్థమయ్యేది కాదు ఒక రోజు తనను, బిడ్డను తీసుకుని దూరంగా వచ్చేసాడు. మళ్ళీ మొదటినుంచి జీవితం మొదలు పెట్టాలి అనుకుని భార్యా బిడ్డల కడుపు నింపడం కోసం చిన్న చితకా ఉద్యోగాలు చేశాడు. చివరికి బిజినెస్ మొదలుపెట్టాడు. అతడి ప్రతి పనిలో తను నిలబడింది. వారికి మరో ఆడపిల్ల పుట్టింది. ఇద్దరు బిడ్డలతో సంతోషం గా జీవించారు. అనుకోకుండా పుట్టింటికి వెళ్ళిన ఆమె తన భర్తకు ఫోన్ చేస్తే డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి అతను చనిపోయాడు అని చెప్పాడు. 30 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయిన ఆమె ఒంటరిగా తన పిల్లలతో జీవితం గడపడం మొదలుపెట్టింది. ఆడపిల్లల్ని ఇద్దర్ని చదివించాలనుకుంది. చదివిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: