Mother's Day Special: ఎందరో తల్లుల చిరునవ్వులకు కారణం ..పినాకిల్ బ్లూమ్స్‌ అధినేత్రి

Mamatha Reddy
సమస్యలు వెంటాడినప్పుడే... మనిషి సత్తా ఏంటో బయటపడుతుంది. అసలు సమస్యల్లో నుంచే పరిస్కార మార్గాలు అన్వేషించబడుతాయి. కష్టం బాధ తెలిసిన వారే.. మరొకరు వేదన చెందకూడదని భావిస్తారు. అలా రూపు దిద్దుకున్న సంస్థే పినాకిల్‌ బ్లూమ్స్‌. తన కొడుకుకు వచ్చిన సమస్య.. దానితో కుటుంబ సభ్యులు పడిన ఆవేదనలో నుంచి పురుడుపోసుకుందే ఈ సంస్థ. ఉరుకుల పరుగుల జీవితంలో ఒకరితో మరొకరు మాట్లాడుకునే సమయమే దొరకడం లేదు. ఎప్పుడు చూసినాపనీ పనీ.. మనుషుల మనసంతా సమస్యల చట్టూనే తిరుగుతుంది. చివరకు ఆ మనిషే సమస్యల్లో చిక్కుకుని అల్లాడుతున్నాడు. మానసిక ఆవేదనకు గురవుతున్నాడు. ఈ స్ట్రెస్ ను ఎలా అధిగమించాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నాడు. సమస్యలతో సావాసం చేసే దంపతుల పిల్లలు సైతం మానసిక సమస్యలతో జన్మిస్తున్నారు. వారిని బాగు చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథత్యంలో అటు పెద్దలు.. ఇటు పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల పరిష్కాకారిని నడుం బిగించారు  సరిపల్లి శ్రీజ. హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో  పినాకిల్‌ బ్లూమ్స్‌ పేరుతో  థెరపీ సెంటర్‌ను ఏర్పాటు చేసి.. వంద మంది స్పెషలిస్టులతో అవసరమైన థెరపీలతో చికిత్సనందిస్తున్నారు. స్వయంగా నూట్రీషియన్ అయిన.. శ్రీజ పిల్లల న్యూరలాజికల్‌ సమస్యలకు పరిష్కారం చూపుతూ ముందుకు సాగుతున్నారు. ఈ ప్రయాణం వెనక కారణం తన బాబు అనుభవించిన కష్టమే అంటారు ఈమె. తమ బాబు సంహిత్ పుట్టినప్పపుడు తాము ఎన్నో కష్టాలు పడినట్లు చెప్పారు. అబ్బాయి పుట్టిన ఏడాదికి ఓ రోజు బాగా జ్వరం వచ్చిందన్నారు. దానితో పాటే నోటి నుంచి నురగలు నురగలు రావగం గమనించారు. భయంతో హాస్పిటల్‌ కు తీసుకెళ్లారు. చికిత్స చేశాక జ్వరం తగ్గింది. కానీ ఆ తర్వాత తనలో విచిత్రమైన మార్పులు కనిపించాయి. చేతికి ఏది దొరికితే అది విసిరేసేవాడు. పిలిస్తే పలికేవాడు కాదు.. దీంతో మళ్లీ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. బాబును పరిశీలించిన డాక్టర్ అబ్బాయికి ఆటిజమ్‌ సమస్య ఉందని చెప్పారు. డాక్టర్ చెప్పినట్లుగానే బాబు ప్రవర్తించేవాడు. మళ్లీ అబ్బాయికి టెస్టులు చేస్తే.. వినికిడి సమస్య ఉందని తేల్చారు. మూడేళ్లు స్పీచ్‌ థెరపీ చేయాలన్నారు. రోజూ స్పీచ్‌ సెంటర్‌కి తీసుకెళ్లాలి. వాడు రెండు రోజులు థెరపీ సెంటర్‌కి వచ్చాడు. మూడో రోజు నుంచి రానన్నాడు. ఇలాంటి పిల్లలకు థెరపీ ఇవ్వాలంటే చక్కటి ప్లేస్ ఉండాలని భావించాం. అలాంటి సంస్థను తామే ఎందుకు స్థాపించకూడదు అని భావించి పరిశోధన చేశాం.  పినాకిల్‌ బ్లూమ్స్‌ సంస్థను స్థాపించాం.. ప్రస్తుతం తమ బాబుకు 4 ఏండ్లు దాటాయి. బాగున్నాడని చెప్పారు శ్రీజ.  
ప్రపంచ జనాభాలో 70  శాతం మంది రకరకాల న్యూరలాజికల్‌ కండిషన్స్, మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఆమె చెప్పారు. ఇలాంటి వారికి థెరపీ ఇచ్చి వారి జీవితాలకు వెలుగునివ్వాలని భావించి.. తన భర్త కోటిరెడ్డితో కలిసి రెండేళ్ల క్రితం  పినాకిల్‌ బ్లూమ్స్‌ పేరుతో స్పీచ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీంట్లో స్పీచ్‌ థెరపీతో పాటు స్పెషల్‌ ఎడ్యుకేషన్, ఆక్యుపేషనల్‌ థెరపీ, బిహేవియరల్‌ మోడిఫికేషన్‌.. అన్నీ ఒకే దగ్గర లభించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు వంద మంది స్పెషలిస్ట్‌ లు ఒకే చోట ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. స్పెషల్‌ పిల్లలే కాదు..  టీనేజ్‌ పిల్లల ప్రవర్తనలోనూ మార్పులు తెచ్చే చికిత్సలు అందిస్తున్నారు.  రకరకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు వచ్చి కౌన్సెలింగ్‌ తీసుకుంటుంటారు. ఆనందంగా వారి భావి జీవితాలను నిర్మించుకుంటున్నారు. ఇప్పటికి హైదరాబాద్‌లో 11 థెరపీ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే ప్రతి జిల్లా కేంద్రంలోనూ పినాకిల్‌ బ్లూమ్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.  ప్రజలు మానసిక సమస్యలు లేకుండా జీవించాలనేదే తమ కోరిక అంటారు శ్రీజ. తన కొడుకు పడిన వేదన మరే మాతృమూర్తి పడకూడదని భావించి.. ఆ దిశగా అడుగులు వేస్తున్న పినాకిల్‌ బ్లూమ్స్‌ అధినేత్రి సరిపల్లి శ్రీజకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: