ఆ మహిళ ఆటో డ్రైవర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..!!

Mamatha Reddy
మగవారితో ఆడవారు ఏమాత్రం తీసిపోరు అన్న విషయం కొంతమంది మహిళలు చేసే పనులను బట్టి తెలుస్తోంది. మగవారికి సమానంగా ఇన్ ఫ్యాక్ట్ మగవారి కంటే మించిన పనులు ఈ తరం మహిళలు చేస్తున్నారు.. వారిలో రోజురోజుకు ఆత్మస్థైర్యం ధైర్యం పెరిగిపోతున్నాయి.. ఇది సమాజానికి ఎంతో సానుకూల నుంచే అంశమే అయినా వారి పై జరిగే అన్యాయాలు వారిని మరింతగా వెనక్కి నెడుతూ ఉన్నాయి.. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎదిరించి ముందుకు నడిచే వారిని విజయం సిద్ధిస్తుంది.. అలా ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఓ మహిళ యొక్క కధ గురించి ఆమె మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 ఒక మహిళ ఆటో తోలడం మనం ఎప్పుడూ చూడలేదు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఓ మహిళ ఇప్పుడు ఆటో నడుపుతూ తన జీవనాన్ని కొనసాగిస్తుంది.. ఆమె రెండేళ్లుగా ఆటో నడుపుతూ తన జీవితాన్ని పోషించుకుంటూ ఉందట.. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత మంది ఎగతాళి చేసినా తనకు తన పని మాత్రమే ధ్యాసగా ఉంటుందని ఆమె చెబుతోంది.. ఎగతాళి చేసే వాళ్ళు అందరూ మా ఇంటికి వచ్చి నాకు ఉండి పెట్టారు కదా..  నా కుటుంబానికి ఎలాంటి సాయం చేయరు కదా.. నా కుటుంబ బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను వారి కోసం మాత్రమే పని చేయాలి. వీళ్ళందరి  మాటలు పట్టించుకుని ఉంటే నేను, నా పిల్లలు పస్తులు  పడుకోవాల్సి వస్తుంది..  అందుకే నేను ఎవరేమన్నా పట్టించుకోను..
 నిజానికి మన చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో అని చాలామంది భయపడుతూ తమకు ఇష్టమైన పని చేయకుండా ఉంటారు.. కానీ ఈ మహిళను చూసిన తరువాత మనుషుల్లో తప్పకుండా మార్పు వస్తుంది.. తన కుటుంబం కోసం ఓ మహిళ పడే కష్టాన్ని చూసి అయినా, ప్రతి ఒక్క మహిళ ఇదే మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించాలని కోరుకుందాం..
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: