అమ్మ: గ‌ర్భిణులు కుంకుమ పువ్వు తీసుకుపోవడం వలన ప్రయోజనాలెన్నో..!

N.ANJI
గర్భిణులు కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాల మంచిదని నిపుణులు చెబుతున్నారు. చ‌ర్మానికి నిగారింపు తీసుకురావ‌డంలో కుంకుమ పువ్వు కీల‌క పాత్ర పోషిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎలాంటి క్రీంలు వాడుకుండానే స‌హ‌జ‌సిద్ధంగా మ‌న చ‌ర్మం మెరిసేలా చేస్తాయి. చ‌ర్మంపై మొటిమ‌లు త‌గ్గించ‌డంలోనూ ఇది దోహ‌దప‌డుతుంది.
ఇక గర్భిణులు ఒత్తిడి, ఆందోళ‌న‌ను త‌గ్గించ‌డంలోనూ కుంకుమ పువ్వు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో పైటోకెమిక‌ల్స్‌, ఫెనోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి మెద‌డుకు అవ‌స‌ర‌మైన సెరోటోనిన్‌ను అందించ‌డంలో స‌హాయ‌ప‌డుతాయి. అందువ‌ల్ల టెన్ష‌న్ ఎక్కువై డిప్రెష‌న్‌లోకి వెళ్తే పాలల్లో దీన్ని క‌లుపుకుని తాగితే వెంట‌నే ఒత్తిడి త‌గ్గుతుంది. మూడ్ కూడా వెంట‌నే మారిపోతుంది.
అంతేకాదు.. రుతుక్ర‌మ సంబంధిత స‌మ‌స్య‌ల‌కు కుంకుమ పువ్వు చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. కుంకుమపువ్వు తీసుకోవ‌డం వ‌ల్ల అధిక ర‌క్త‌స్రావం వంటి స‌మ‌స్య కూడా ఉండ‌దు. అంగ‌స్తంభ‌న, వీర్య క‌ణాలు తక్కువ ఉన్న‌వారు రోజూ కుంకుమ పువ్వును తీసుకోవ‌డం వ‌ల్ల స‌త్ఫ‌లితాలు క‌నిపిస్తాయి. బాదం పాల‌ల్లో కుంకుమ పువ్వును క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల సెక్స్ సామ‌ర్థ్యంతో పాటు సంతానోత్ప‌త్తి సామ‌ర్థ్యం పెరుగుతుంది.
అయితే శ‌రీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువైతే క‌ణాల‌ను దెబ్బ‌తీస్తుంది. ఇది ఎక్కువైతే క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. అయితే ఈ ఫ్రీ రాడిక‌ల్స్ పెర‌గ‌కుండా చూసే యాంటీ ఆక్సిడెంట్లు కుంక‌మ పువ్వులో ఎక్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి కుంకుమ పువ్వును రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ బారిన ప‌డే అవ‌కాశం త‌గ్గుతుంద‌ని ప‌లు అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. జీవక్రియ‌ను నియంత్రించ‌డంలోనూ కీల‌క పాత్ర పోషిస్తుంది. రోజూ దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఆక‌లి అవ్వ‌దు. కొద్దిగా తిన‌గానే క‌డుపు నిండిన‌ట్టు అనిపిస్తుంటుంది. కాబ‌ట్టి త‌క్కువ ఆహారం తీసుకుంటారు. దీనివల్ల బ‌రువు త‌గ్గుతారు.
అంతేకాదు.. కీళ్ల నొప్పులు, ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ కుంకుమ పువ్వు స‌హాయ‌ప‌డుతుంది. ఆస్త‌మా, కోరింత ద‌గ్గు ఇలా ప‌లు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ ఉప‌యోగ‌ప‌డుతుంది. కుంకుమ పువ్వులో క్రోసిటిన్ ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి ర‌క్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. ఫ‌లితంగా హృద్రోగాలు వ‌చ్చే అవ‌కాశం కూడా త‌గ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: