ఏపీ ఎలక్షన్స్: మీ ఓటు అబద్దానికా.. నిజానికా..?

Pandrala Sravanthi
ఏపీలో ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే వైసిపి,టిడిపి కూటమి  పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించి  గెలుపుపై భరోసాతో ఉన్నారు. ఇక ఒక్క జగన్ ను ఓడించడం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ లు జతకట్టాయి. కానీ సింహం సింగిల్ గా వచ్చినట్టు  జగన్ మాత్రం సింగిల్ గానే పోటీ చేస్తూ వారందరికీ హడలెత్తిస్తున్నాడు. ఈ పరిస్థితిని చూస్తే మాత్రం జగన్ గెలుపు ఇప్పటికే డిసైడ్ అయిందని అర్థం చేసుకోవాలి. ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు భయపడిపోయి కూటమిగా ఏర్పడ్డాడు అంటే  జగన్ కి ప్రజల్లో ఏ విధమైన ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో చంద్రబాబు ఇన్ని చేసినా  జగన్ మానియా తగ్గడం లేదని అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. 


అసలు రాష్ట్ర బడ్జెట్లో అమలు కానటువంటి పథకాలు ఇస్తానని హామీ ఇస్తూ వస్తున్నాడు. బడ్జెట్ లేనప్పుడు ఆ పథకాలు ఎలా అమలు చేస్తాడు..అంటే అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఉన్న పథకాలన్నీ ఊడదీసి ప్రజలను రోడ్డున పడేయ్యాలనే ఆలోచన కూటమికి ఉందని అర్థం చేసుకోవాలి. చదువుకున్న యువత వారి తల్లిదండ్రులకు చెప్పాలి. ఏ పథకం అమలు చేయాలన్నా తప్పనిసరిగా దానికి సంబంధించిన బడ్జెట్ ఉండాలి.  చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఆ బడ్జెట్ ఏ మాత్రం సరిపోదు అని... కట్ చేస్తే జగన్, చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజలను ఆకర్షింప చేయవచ్చు. మనం ఉన్నంతలో  ఎదగాలి.  రాష్ట్రం పూర్తిగా అప్పులపాలు అయితే ప్రజల భవిష్యత్తు  పాడవుతుందనే ఆలోచన చేసి ఆయన ఉన్న పథకాలనే కాస్త పెంచుతూ, మళ్లీ అమలు చేస్తామని హామీ ఇచ్చాడు.


 మళ్లీ జగన్ సీఎం అయితే ఈ పథకాలు తప్పనిసరిగా అద్భుతంగా అమలు చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయన అమలు చేసే హామీలు మాత్రమే ఇచ్చాడు. నిజాలు మాత్రమే చెబుతూ వస్తున్నాడు. ప్రజలకు అబద్ధాలు చెప్పి అందలం  ఎక్కిన తర్వాత మొండి చేయి చూపించే వ్యక్తి జగన్ కాదు. ఎప్పుడైనా ప్రజల కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడే జగనన్నకు సపోర్ట్ చేయడానికి ఎంతో మంది ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ తరుణంలో నిజానికి ఓటు వేస్తారా .. అబద్దాల కోరుకు ఓటు వేస్తారా అనేది ప్రజల డిసైడ్ చేసుకోవాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: