ఏపీలో బీసీల బలం ఎవరికి.. రాష్ట్రంలో బీసీలు ఆ పార్టీ వైపే ఉన్నారా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీలలో మెజారిటీ శాతం ఏ పార్టీ వైపు ఉన్నారనే ప్రశ్నకు వైసీపీవైపే ఉన్నారని సమాధానం అందుతోంది. జగన్ అమలు చేసిన వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా బీసీ మహిళలలో ఎక్కువమంది లబ్ధి పొందారు. బీసీ మహిళలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కువ ప్రయోజనం చేకూరేలా గత ఐదేళ్లలో సీఎం జగన్ ఎన్నో పథకాలను అమలు చేయడం జరిగిందని సమాచారం అందుతోంది.
 
జగన్ అమలు చేస్తున్న పథకాల ద్వారా కలిగిన లబ్ధి గతంలో ఎప్పుడూ కలగలేదని బీసీలు బహిరంగంగానే చెబుతున్నారు. సంక్షేమం విషయంలో జగన్ బీసీలకు పెద్దపీట వేశారని అదే సమయంలో వైసీపీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విషయంలో జగన్ బీసీలకే ప్రాధాన్యత ఇచ్చారని సమాచారం అందుతోంది. చంద్రబాబు బీసీల సంక్షేమం కోసమే కష్టపడతానని చెప్పినా వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి.
 
చంద్రబాబు సొంత కులానికి చెందిన వాళ్లకు లబ్ధి చేకూర్చిన స్థాయిలో బీసీలకు లబ్ధి చేకూరలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రేమ మాటలకే పరిమితమవుతుందే తప్ప వాస్తవాల్లో మరో విధంగా ఉంటుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రమే న్యాయం జరుగుతుందని చెప్పవచ్చు.
 
జగన్ ఈరోజుకు కూడా ఓటు వేసేవాళ్లు తమకు మంచి జరిగితే మాత్రమే ఓటేయాలని మగవాళ్లు ఓటు వేసేముందు భార్య, పిల్లలతో ఒకసారి మాట్లాడి ఓటు వేయాలని కోరుతున్నారు. జగన్ తన పాలనలో జరిగిన సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో ఎంత నమ్మకం ఉంటే ఈ తరహా కామెంట్స్ చేస్తారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఐదారు నెలల క్రితం జగన్ పై ఒకింత వ్యతిరేకత కనబడినా క్రమంగా పరిస్థితులు మారుతూ వచ్చాయి. జగన్ ను అభిమానించే ఓటర్లే మరోసారి రాష్ట్రంలో వైసీపీని అధికారంలోకి తీసుకురావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: