'ఆటిజం' చిన్నారులకు అండగా నిలిస్తూ.. వేలాదిమంది పిల్లలకు దైవంగా మారిన శ్రీజా రెడ్డి..!!

Mamatha Reddy
మానవుడి ఆయిష్షు100 సంవత్సరాలు.. ఇది మన తాతల కాలం నాటి మాట.. కానీ ఇప్పుడు మనం ఇన్నేళ్లు బ్రతుకుతామో మనకే తెలియని పరిస్థితి.. దానికి ప్రధాన కారణం.. మనిషికి వచ్చే రోగాలు..ఇప్పుడున్న వాతావరనానికి, మనం తినే తిండికి.. ఇక చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.. అందుకే రోజుకో కొత్త రోగం పుట్టుకొస్తుంది మానవ శరీరంలో.. అలాంటి మ‌నిషికి వ‌చ్చే అనేక ర‌కాల వ్యాధుల్లోకి ఆటిజం అత్యంత ద‌య‌నీయ‌మైంది.. బాధాక‌ర‌మైంది...ఆటిజంలో ఏదో ఒక స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారికి  ఉన్న‌వారికి కనీసం తాము ఆటిజంతో బాధ‌ప‌డుతున్నామ‌నే సంగ‌తి కూడా వాళ్లకి తెలియదు.. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు.. ఏం తింటున్నారు. ఏం తాగుతున్నారో కూడా గుర్తించలేక పోవ‌డం ఈ సమస్యలో ప్రధాన కారణం. అయితే, ఇలాంటి స‌మ‌స్య‌ను త‌మ కుటుంబంలో ఎదుర్కొనాల్సివ‌చ్చిన‌ప్పుడు ఆ కుటుంబ పెద్ద‌లు ఎంత‌గా న‌లిగిపోతారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు..వారి బాధ నిజంగా వ‌ర్ణ‌నాతీతం.
ఇలాంటి స‌మ‌స్యే ప్ర‌పంచానికి ఐటీ పాఠాలు చెప్పే.. ప్ర‌ముఖ టెకీగా గుర్తింపు పొందిన కోటిరెడ్డి స‌రిప‌ల్లి కుటుంబంలో చోటు చేసుకుంది. కోటిరెడ్డి, శ్రీజారెడ్డి దంప‌తుల ఏకైక కుమారుడికి వినికిడి లోపం వ‌చ్చింది. ఈ దంప‌తుల పెద్ద కుమారుడు సంహిత్ వినికిడి లోపంతో పుట్ట‌డంతో వీరు ఎంతో మ‌నోవేద‌న‌కు గుర‌య్యారు. నిజానికి చేతి నిండా డ‌బ్బులున్నాయి. ఐశ్వ‌ర్యానికి లోటు లేదు. అనుభ‌వించే అవ‌కాశ‌మూ ఉంది. అయితే త‌మ పెద్ద‌కుమారుడు మందుల‌కు లొంగ‌ని వినికిడి లోపంతో ఇబ్బంది ప‌డుతున్నారు. అంతే! ఆ త‌ల్లిదండ్రుల ఆవేద‌న క‌ట్ట‌లు తెగింది. ఏం చేయాలి ?

తమ కుమారుడిని ఎలా న‌యం చేసుకోవాలి ? ఇదే ఆ తల్లిదండ్రుల‌కు ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. ఈ క్ర‌మంలో తండ్రి క‌న్నా త‌ల్లి శ్రీజారెడ్డి ప‌డిన ఆవేద‌న అంతా ఇంతా కాదు. ఒక్క‌గానొక్క కుమారుడు వినికిడి స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతుంటే.. ఆమె చూడ‌లేక పోయారు. ఎలాగైనా త‌మ కుమారుడిని న‌యం చేసుకోవాల‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే ఆమె అనేక మంది వైద్యుల‌ను క‌లిశారు. అయితే, ఎవ‌రిని క‌లిసినా.. న‌యం కాని వ్యాధిగానే తేల్చి చెప్పారు. అయినా ప‌ట్టు వీడ‌ని ప్ర‌య‌త్నం త‌న కుమారుడిని న‌యం చేసుకోవాల‌నే గ‌ట్టి సంక‌ల్పం ఆమెను ముందుకు న‌డిపించాయ‌. ఫ‌లితంగా ఏర్పడిందే పినాకిల్ బూమ్స్ సంస్థ‌. ఒక్క త‌న కుమారుడినే కాదు.. ఆటిజంతో ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న పిల్ల‌ల‌కు ఆస‌రా నిలిచారు. స్వయంగా ఒక సంస్థను స్థాపించి ఎందరో వేల మంది పిల్లలకు అండగా నిలిచి..ఈ సమాజ అభివృద్ధికి పాటు పడుతున్నారు..శ్రీజా రెడ్డి గారి సేవా గుణానికి హ్యాట్సాఫ్ చెప్తూ.. వీరి లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది మహిళలు మరెన్నో సేవా కార్యక్రమాలను చేయాలని కోరుకుందాం..!!


" >

" >

" >


" >

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: