జీవితం లో కష్టాలు ఉన్నాయి అనుకునే ప్రతిఒక్కరు ఈ బామ్మ కథ చదవాల్సిందే

Mamatha Reddy
చాలామంది మనుషులు ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు జీవితం అంతా అయిపోయింది మనమేం చేయలేమని సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది ఇప్పటి కూడా వాళ్ల స్వశక్తితో బతకడానికి ఇష్టపడుతుంటారు. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానని,ఉద్యోగం రాలేదని, లవ్ లో మోసపోయిన అని ఇలా రక రకాల కారణాలతో  రోజు చాలామంది సూసైడ్ చేసుకుంటారు, కానీ ఒక లైఫ్ మనల్ని చేజారిపోతే ఇంకో లైఫ్ ఉంటుందని పాజిటివ్ గా ఆలోచించే శక్తి ఈ తరం జనరేషన్ లో తక్కువ అయిపోయింది. ఎందుకంటే ఈతరం అబ్బాయిలలో కష్టపడే తత్వం తక్కువ అయిపోయింది అందువల్లే ఏ చిన్న కష్టం వచ్చినా చాలా పెద్ద కష్టం గా కనిపించి దీన్ని మనం సాల్వ్ చేయలేమని అని వాళ్లకు వాళ్లే ఊహించుకొని సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ 70 సంవత్సరాల వయసున్న ఎల్లమందమ్మ మాత్రం దేనికి భయపడకుండా ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా తన పనులు తాను చేసుకుంటూ ఇంకా కూడా ముందుకు సాగిపోతుంది. ఇప్పటికి 70 సంవత్సరాలు ఉన్నా కూడా ఆమె రోజు సైకిల్ ని తీసుకుని వెళ్లి దానిపై గడ్డిమోపు కట్టుకొని వస్తుంది.  రోజు గుంటూరు నుంచి నాలుగు కిలోమీటర్లు వరకు సైకిల్ మీద ప్రయాణిస్తుంది వచ్చే దారిలో కొంతమేరకు దారి సరిగ్గా లేకపోవడంతో సైకిల్ పట్టుకొని గడ్డిమోపు వెనకాల పెట్టుకొని రైలు పట్టాల పక్కన సైకిల్ నెట్టుకుంటూ వస్తుంది తనకొక కొడుకు కూడా ఉన్నాడు ఇవన్నీ నేను చూసుకుంటాను అని అతను చెప్పినప్పటికీ నా ఒంటి లోపల పనిచేసే సత్తువ ఉన్నంతకాలం నా పని నేను చేసుకుంటాను అని ధైర్యంగా చెప్పగలిగే ఆమెను చూస్తే చిన్న చిన్న బాధలతో చచ్చిపోయే చాలామంది ఎల్లమందమ్మని చూసి బతుకు మీద ఆశలు పెంచుకుని ఆమెని ఆదర్శంగా తీసుకొని బతకాలని కోరుకుంటున్నాము...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: