అందం ముఖ్యమా లేక ఆరోగ్యం ముఖ్యమా ...?

Suma Kallamadi

ఆడవాళ్ళకి  అందం ముఖ్యమా లేక ఆరోగ్యం ముఖ్యమా అంటే ఆరోగ్యమే ముఖ్యం అంటారు అసలు అందుకే గా ఉండాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి కదా. అందుకనే ముందు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జీవన సూత్రాలు పాటించాలి అవేంటో తెలుసుకుందాం.. మన పెద్దలు ముందే చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యము అని..అయితే చాలా మంది  అవసరానికన్నా అధికంగా  తినటం అలవాటైన వారికి.. కడుపులో జీర్ణాశయం గోడలపై వాపు తరహా ఇన్‌ఫ్లమేషన్‌ తలెత్తి... అజీర్తి, ఆకలి పెరగటం, పేగుల్లో చిరాకు, బరువు పెరగటం  వంటి సమస్యలకు దారితీస్తుంది. 

 

 

మన  ఆహార అలవాట్లు, జీవనశైలిలో  చిన్నచిన్న మార్పులు తీసుకురావటం  ద్వారా ఆరోగ్యంలో, శరీర ఆకృతిలో  పెద్దపెద్ద మార్పులే తీసుకు రావచ్చు. రోజూ గ్లాసుడు పచ్చి కూరగాయల రసం తాగటం శ్రేయస్కరం. క్యారెట్‌, ఉసిరి, కూరగాయల రసాల్లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఉత్తేజాన్నిస్తూ ఆహారాన్ని తేలికగా జీర్ణం చేస్తాయి.  బీటాకెరటిన్‌, విటమిన్ ‌- సి, విటమిన్ ‌- ఇ, కూరగయాలు, గింజల్ని రోజువారీ ఆహారంలో తీసుకోవాలి. ఆరోగ్యంగా, చక్కగా ఉన్నారనేది శరీరాకృతి చక్కగా ఉండటం ఒక సంకేతం. తక్కువగా తినటం ద్వారా వృద్ధాప్య ఛాయలూ నెమ్మదిస్తాయి. సరిపడినన్ని మాంసకృత్తులు తీసుకోవాలి. ఇవి కణజాలానికి మరమ్మతులు చేస్తాయి. ఎముకల ఎదుగుదలను ప్రేరేపిస్తాయి. ఒత్తిడిని నియంత్రించాలి. ఒత్తిడి రోగ నిరోధక వ్యవస్థను అణచి పెడుతుంది. అలాగే వయసు మీద పడేలా చేస్తుంది. కావున ఒత్తిడిని దూరం చేయాలి. 

 

 

వారంలో ఒకరోజు ఇతరత్రా ఆహారం తీసుకోకుండా పచ్చి కూరగాయ ముక్కలు  తినొచ్చు. స్థూలకాయాన్ని అడ్డుకోవటానికి ఇది చక్కని మార్గం. నెలకు ఒక్కరికి 500 మి.లీ.కన్నా ఎక్కువగా నూనెల్ని వాడకూడదు. అది కూడా ఆలివ్‌, తవుడు, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆవ నూనెలు మేలు. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, ప్రాసెస్డ్‌ ఆహారం, వేపుళ్లు తగ్గించటం ద్వారా వయసు మీద పడటాన్నీ నిరోధించవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పెంపుడు జంతువులతో అనుబంధాల్ని పెంచుకోవాలి.వారానికి అయిదు రోజులైనా 30-40 నిమిషాలపాటు వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. చెమట పట్టటం వల్ల నిల్వఉండే విషపదార్థాలు బయటికి పోతాయి. ఏరోబిక్‌ వ్యాయామాలు జీర్ణశక్తినీ, జీవక్రియల్నీ పెంచుతాయి. పొగతాగటం మానటం ద్వారా ఆరోగ్యానికి మరింత బలాన్ని అందించవచ్చు.రోజులో వీలైనంత ఎక్కువ నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: