ఇంట్లో ఉండి ఉద్యోగం చేసే ఆడవాళ్లు ఇవి తప్పకుండా పాటించాలి లేదంటే మీ ఉద్యోగం సంగతి అంతే... !!

Suma Kallamadi

 మహిళలు చాలామంది ఇంట్లోనే ఉండి హోమ్ బేసెడ్ జాబ్స్ చేస్తున్నారు. అందులోను ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా కొన్ని సంస్థలు ఇంటి నుంచే పని చేయమని చెబుతున్నాయి.అలాగే చాలా మంది స్త్రీలు  ఉద్యోగాలను ఇంటినుంచి చేస్తున్నారు.  ప్రయాణ సమయం ఆదా చేయడానికి ఇంటి నుంచి పని చేయమని చెప్పే కంపనీలు చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు చాలామంది ఇంట్లోనే పని చేయడానికి సుముఖంగా ఉన్నారు కదా ఇంట్లో పని చేయాల్సిన అప్పుడు మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయాలను మనం ఇప్పుడు చూద్దాం.

 

ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు సకాలంలో పని పూర్తి చేయాలనే నియమం అని మీకు మీరే పెట్టుకోవాలి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి విశ్రాంతి తీసుకుంటూ నెమ్మదిగా పని చేద్దాం అని అనుకోకూడదు సాయంత్రం లోపల నిర్లక్ష్య ధోరణి పనికిరాదు అనుకున్న సమయంలో చేస్తే ఉద్యోగం ఉద్యోగం చేసే మనకు కూడా చాలా గౌరవంగా ఉంటుంది. పని ఇంటి నుంచే కదా లేద్దాంలే  నిదానంగా తయారవుదాం అన్నా  ధోరణి కూడా వద్దు. సాధారణంగా ఆఫీస్ కి వెళ్లడానికి ఏ సమయానికి నిద్ర లేస్తామో  అదే సమయానికి లేవాలి ఎప్పటిలాగే సిద్ధమవ్వాలి. ఇంట్లో ఉన్నప్పుడు ధరించే సాధారణ దుస్తులు వేసుకుని పని చేయటానికి కూర్చుంటే మీరు వేగంగా సమర్థంగా పని చేయలేరు ఎందుకంటే ఇంట్లోనే ఉన్నాను కదా ఏ బట్టలు వేసుకుంటే ఏంటి అన్న ఆలోచన పనికిరాదు మీరు ఆఫీస్ కి ఎటువంటి బట్టలతో వెళ్తున్నారు అలాంటి బట్టలు వేసుకుని మీరు కంఫర్ట్ గా ఉద్యోగం అనేది చేస్తూ ఉండాలి. మీరు పనిచేసే స్థలంలో గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా  చూసుకోవాలి.బెడ్ రూమ్ లోగాని, ఏదన్నా ఒక రూమ్ లోగాని మి పని చేయండి.  మీరు పని చేసేటప్పుడు ఇటువంటివి లేకుండా నిశ్శబ్దంగా ఉన్న స్థలంలో పని చేసుకుంటూ ఉండాలి. టీవీ సౌండ్స్, ఇంట్లో వల్ల మాటలు వినిపించనంత దూరంగా ఉండండి. అనుకోకుండా గ్రూప్ మీటింగ్ కోసం ఆఫీస్ నుంచి ఫోన్ రావచ్చు లేదా మీ ఆఫీస్ నుంచి ఐదు నిమిషాల్లో వీడియో సమావేశానికి సిద్ధం కమ్మని సమాచారం రావచ్చు అలాంటి సందర్భాల్లో మీరు ఎలాంటి సాకులు చెప్పే అవకాశం ఉండదు కాబట్టి ఆఫీసు పనికి కేటాయించిన సమయం లోనే మీ పనిని మాత్రమే చేయాలి. 

 

 

 అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే మీరు పని చేస్తున్నప్పుడు పనిలో బాగానే అర్థం అయినప్పుడు భోజనం చేయడం చిన్న విరామం తీసుకోవటాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు ఎందుకంటే ఆఫీసులోని భోజన విరామ సమయంలో ఇంటి దగ్గర కూడా పాటించాలి మీరు భోజనం చేయకుండా టిఫిన్ చేయకుండా అస్తమానం పని చేస్తూ ఉంటే మీకు నీరసం వస్తుంది అలాగే ఆఫీస్ లో మాదిరిగా ఇంట్లో వసతులు లేక పోవచ్చు ఏసీ గదులు ఉండకపోవచ్చు కూర్చోవడానికి సౌకర్యవంతమైన కుర్చీలు కూడా ఉండకపోవచ్చు కాబట్టి ఇటువంటి ఇటువంటి సమయంలో ఇంటిలో ఉద్యోగం చేసుకునే సమయంలో ఇటువంటి వాటిని పక్కన పెట్టి మీ పనిని సక్రమంగా చేసుకుంటే మీకు ఆఫీస్ లో మంచి గుర్తింపు వస్తుంది.అలాగే పని చేసేటప్పుడు పని మీద ధ్యాస ఉంచాలి తప్పా వేరేవాటిమీద పెట్టకండి.. పొరపాటున ఎమన్నా తప్పు చేస్తే అది మీ ఉద్యోగం మీద పడుతుతుంది.. కొన్ని సార్లు మీరు చేసే చిన్నా తప్పే చాలా నష్టాన్ని చేకూరుస్తుంది.. కాబట్టి జాగ్రత్తగా పని చేయండి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: