శ్రీజారెడ్డి: ఈ విజయానికి ఆవేదనే పట్టుదల.. ఆత్మీయతే పెట్టుబడి..!
ఒక లక్ష్యం.. ఒక పట్టుదల.. ఒక కృషి.. ఒక విజయానికి సోపానాలుగా మారితే.. అందుకుని ఆస్వాదించడ మే తరువాయి! అయితే, లక్ష్యం-పట్టుదల-కృషి-విజయం వంటివి గుండుగుత్తుగా ఒకరివైతే.. వాటి వల్ల వచ్చే ఆస్వాదన వేరేవారిది! చిత్రంగా అనిపించినా ఇది నిజం. చిన్నారుల్లో సంక్రమించే బుద్ధి మాంద్యం (ఆటిజం) వారినే కాకుండా వారి తల్లిదండ్రులను కూడా తీవ్ర వేదనకు గురిచేయడం తెలిసిందే. ఇలాంటి ఆవేదననే పంటి బిగువన భరించారు డాక్టర్ శ్రీజారెడ్డి. తన కుమారుడు ఆటిజం భారిన పడడంతో ఆమె తీవ్ర వేదన అనుభవించారు.
ఎట్టకేలకు ఆటిజం పరిష్కారానికి అనేక ప్రయత్నాలు చేసి.. అన్ని థెరపీలను ఒకేగొడుగు కిందకు చేర్చే ప్రయత్నం చేశారు. అదే హైదరాబాద్‌లోని పినాకిల్ బ్లూమ్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆటిజంతో బాధపడే చిన్నారులను తన సొంత బిడ్డల్లా భావిస్తూ.. ఇక్కడ వారికి వివిధ రూపాలలో సేవలు చేరువ చేశారు. కేవలం 2017లో ఏర్పాటైన ఈ సంస్థ.. ఇప్పుడు ఇంతింతై.. ఆకాశమంతై.. అన్నట్టుగా ప్రపంచ వ్యాప్తంగా సేవలు విస్తృతం చేసింది. కొన్ని వందల మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతూనే వారి తల్లిదండ్రుల మోముల్లో చిరునవ్వులు చిందిస్తోంది.
పినాకిల్ బ్లూమ్స్ సంస్థలో వంద మంది స్పెషలిస్టులు ఒకే చోట సేవ అందిస్తున్నారు. స్పెషల్ చిల్డ్రన్స్ మాత్రమే కాకుండా టీనేజ్ పిల్లల్లో కనిపించే మార్పుల విషయంలోనూ థెరపీలను చేరువ చేశారు. పలు రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సంస్థ మాతృప్రేమను పంచుతూ.. వారిలో మార్పు వచ్చేలా కృషి చేస్తుండడం గమనార్హం. చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రతను బట్టి మూడు నెలల వయసు నుంచి రెండేళ్లు వచ్చే వరకు కూడా వివిధ రూపాల్లో చికిత్సను అందిస్తున్నారు.
నిజానికి ఆటిజం, ఏడీహెచ్‌డీ వంటి సమస్యలు ఉన్న చిన్నారులను వారి తల్లిదండ్రులే భరించలేని పరిస్థితి ఉంటుంది. అయితే, ఇలాంటి వారికే పునరుజ్జీవం కల్పించాలనే ద్రుఢ సంకల్పంతో
Offers:
speech therapy
Occupational Therapy
Behavioral Therapy
Autism Therapy
Psychological Counseling
Special Education
Dance Therapy
Music Therapy
Yoga Therapy
Hydro Therapy
Physiotherapy
Assesments
Group Teaching
Certified Courses
Parent Training
Teacher Training
School Training