అమ్మ తీర్చిదిద్దిన అఖిల ప్రియ

Gullapally Venkatesh

శోభా నాగిరెడ్డి... శోభా నాగిరెడ్డి అంటే కర్నూలు, కర్నూలు అంటే శోభా నాగిరెడ్డి అనే విధంగా ఆమె ప్రభావం చూపించారు అనేది వాస్తవం. భూమా కుటుంబం నుంచి వచ్చిన నాయకుల్లో అత్యంత ప్రభావం చూపించిన వ్యక్తి ఆమెనే. ఆమె తర్వాతే ఎవరు అయినా భూమా కుటుంబంలో అని చెప్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఆమె కుమార్తె అఖిల ప్రియ రాజకీయాల్లో తన వంతు పాత్రను పోషిస్తూ వస్తున్నారు. ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆమె చాలా కీలకంగా ఉన్నారు. రాజకీయాల్లో చిన్న వయసు లోనే ఆమె అడుగు పెట్టారు. 

 

తల్లి మరణించిన కొన్ని రోజులకే ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఆళ్ళ గడ్డ ఎమ్మెల్యే గా విజయం సాధించారు. ఆళ్లగడ్డ నుంచి ఆమె ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు. భూమా కుటుంబం నుంచి మంత్రి అయిన తొలి వ్యక్తి కూడా ఆమెనే అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ఆమె రాజకీయాల్లో నేడు రాణించడానికి ప్రధాన కారణం ఆమె తల్లి అని అంటూ ఉంటారు. తల్లిని దగ్గరగా గమనించడం తోనే ఆమె నేడు ఈ స్థాయిలో ఉన్నారని ఆమె తల్లి అందించిన ప్రోత్సాహం తోనే ఆమె మంత్రి గా కూడా రాణించారు అని అంటారు. 

 

తల్లిలో ఉన్న ధైర్య సాహసాలు ఆమెలో ఎక్కువగా ఉంటాయని కొందరు చెప్తూ ఉంటారు. తల్లి శోభా ఎవరికి భయపడే వారు కాదు. ఆళ్లగడ్డ లో అయినా కర్నూలు జిల్లాలో అయినా సరే ఆమె సహకారం తో పైకి వచ్చిన నాయకులు ఎందరో ఉన్నారు. వారు అందరూ కూడా ఇప్పుడు అఖిల ప్రియ కు కూడా అండగా నిలబడిన వారే అనేది వాస్తవం. ఆ విధంగా అఖిల ప్రియ నేడు రాజకీయాల్లో నిలబడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: