ఆడవాళ్లు నవ్వితే చూడముచ్చటగా ఉంటుంది కదా... !! అలా నవ్వినప్పుడు పళ్ళ రంగు తెల్లగా లేకపోతే ఎలా ... !!!
ఆడవాళ్లు నవ్వితే ముత్యాలు రాలతాయి...అని చాలా మంది అంటూవుంటారు.. అలా నవ్వినప్పుడు పళ్ళు తెల్లగా ఉంటే వాళ్ళ నవ్వు చూడముచ్చటగా ఉంటుంది.. అదే పళ్ళు రంగు మారి ఉంటే? నవ్వడం మాట దేవుడెరుగు కానీ అసలు మాట్లాడాలన్నా భయపడిపోతారు.మన ఆహారపుటలవాట్లు, శుభ్రత లేమి వల్ల దంతాలు రంగు మారతాయి.తెల్లగా ఉండాల్సిన పళ్ళ వరుస పసుపు రంగులోకి మారిపోతాయి .దాంతో ముఖాకర్షణ తగ్గుతుంది. దంతాలను తిరిగి మెరిపించాలంటే ఈ చిట్కాలు పాటించాలి.
స్ట్రాబెర్రీ లు ఎక్కువగా తినాలి. విటిలోని మాలిక్ యాసిడ్, విటమిన్ ' సి'దంతాలను తెల్లగా మార్చే గుణాలుకలిగి ఉంటాయి స్ట్రాబెర్రీలను గుజ్జుగా చేసి వారానికి రెండుసార్లు దంతాలకు పూసుకోవాలి. కొద్దీ సేపటి తర్వాత తోముకుంటే దంతాలుక్రమంగా తెల్లబడుతాయి, వీటిని తినే టప్పుడు కూడా బాగా నమిలితే కూడాఅదే ఫలితం దక్కుతుంది.. బేకింగ్ సోడా, నిమ్మరసం మధ్య జరిగే రసాయన చర్య ఫలితంగా కూడా దంతాలు తెల్లబడుతాయి. ఈ రెండింటిని కలిపి వారానికోసారి బ్రష్ తో అద్దుకుని దంతాలని రుద్దుకోవాలి. పదే పదే వాడితో దంతాల మీద ఎనామిల్ దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి వారానికి ఒక్కసారే ఉపయోగించాలి.
బేకింగ్ సోడా, నిమ్మ రసాలను కలిపి దంతాలకు పట్టించి ఒకనిమిషం తర్వాత బ్రష్ తో సున్నితంగా రుద్దుకుని కడిగేసుకోవాలి. నిమిషం కంటే ఎక్కువ సమయం,పాటు ఈ మిశ్రమాన్ని దంతాల మీద ఉంచకూడదు. యాపిల్స్, క్యారెట్స్, చెరకులను తరచుగా తింటూ ఉండాలి.వీటి వల్ల దంతాల మీద పేరుకున్న గార, మచ్చలు వదిలి పోతాయి. ఈ పళ్లలోని యాసిడ్లు దంతాలను తెల్లగా మారుస్తాయి. యాపిల్స్లోని మాలిక్ యాసిడ్ దంతాలను శుభ్రం చేసే మెరిసేలాచేస్తుంది. ఆర్గానిక్ ఆయిల్ నోట్లోకి తీసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మేయాలి. తరువాత నోటిని శుభ్రంగా కడిగి 2 గ్లాసుల నీరు తాగాలి.
బత్తాయి ప్రతి రోజూ రాత్రి నిద్రకు ముందు బాత్తాయి తొక్క తో దంతాలు రుద్దుకున్నా గాని ప్రయోజనం ఉంటుంది. ఇలా కొన్ని వారాల పాటు క్రమం తప్పక చేస్తే ఫలితం కనిపిస్తుంది.హైడ్రోజన్ పెరాక్సైడ్: ముందుగా హైడ్రోజన్ పెరాక్సైడ్ తో నోరు పుక్కిలించాలి.లేదా బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పళ్ళకి రుద్దుకోవాలి. తర్వాత టూత్ పేస్ట్ తో దంతాలు రుద్దుకుని శుభ్రం చేసుకోవాలి.