ముల్తానా మిట్టితో మీ అందానికి మెరుపునివ్వండి ఇలా.... !
ఆడవాళ్లు ముఖం కాంతివంతంగా మారడానికి ఎన్ని చిట్కాలనైనా ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటారు. కలుషితమైన వాతావరణం వల్ల, సరైన సంరక్షణ లేకపోవడం వల్ల, జీవనశైలి వల్ల మీ ముఖం కళ తప్పుతుంది. చర్మ సమస్యలు ఏవైనా సరే పరిష్కరించడానికి కొన్ని సహజ మార్గాలు ఉంటాయి. అటువంటి సహజ మార్గాలలో ముల్తానీ మిట్టి ఒకటి. ముల్తానీ మిట్టి అద్భుతమైన గుణాలను కలిగి ఉంటుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇంకా మీ ముఖం చాలా ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. దీనిని ఏ రకమైన చర్మానికైనా ఉపయోగించవచ్చు.ఇది జిడ్డు చర్మాన్ని నివారించడానికి సహాయపడుతుంది. మొటిమలను కూడా తొలగిస్తుంది. చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మృదువుగా అందంగా చేస్తుంది. సన్ టాన్ నుండి చర్మాన్ని రక్షించి చర్మానికి సహజ కాంతిని అందిస్తుంది. చర్మంలొ మొటిమల మచ్చలు మరియు గాయాల వల్ల ఏర్పడన మచ్చలను తొలగిస్తుంది. ఇప్పుడు ముల్తానీ మిట్టి ముఖానికి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..
గంధపు చెక్కకు సంకోచించే గుణాలు ఉన్నాయి. ఇది చర్మ రంధ్రాలను మూసివేసి చర్మాన్ని బిగించుకునేలా చేస్తుంది.. ఒక 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టిలో, ఒక టేబుల్ స్పూన్ గంధపు చెక్క పొడిలో కొద్దిగా నీరు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ను ముఖానికి మరియు మెడకు రాసి 15-20 నిమిషాలు తర్వాత కడగాలి.
చర్మం కాంతిని పెంపొందించే పసుపులో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. టొమాటో జ్యూస్ మంచి బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్నికాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది. ఒక బౌల్ లో 2 టేబుల్ స్పూన్లు ముల్తానీ మిట్టి, 1 టేబుల్ స్పూన్ టమోటా రసం, ½ టేబుల్ స్పూన్ పసుపు పొడి వేసి బాగా కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ను ముఖానికి, మెడకు అప్లై చేసుకుని 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
క్యారెట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది దుమ్ము, ధూళిని చర్మంలో పేరుకుపోకుండా నిరోధిస్తుంది మరియు చర్మరంధ్రాలు అభివృద్ధి చెందకుండా చేస్తుంది. ఆలివ్ ఆయిల్ చర్మానికి తేమను అందిస్తుంది మరియు చర్మాన్ని చాలా మృదువుగా, అందంగా చేస్తుంది. ఒక 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి, 1 టేబుల్ స్పూన్ క్యారెట్ రసం, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి మెత్తని పేస్ట్ లాగా కలుపుకుని మీ ముఖానికి అప్లై చేసుకుని అరగంట తర్వాత కడిగేయాలి.బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి మరియు డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది, దుమ్ము మరియు ధూళి వంటి మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. సన్ టాన్ ను కూడా నివారిస్తుంది. ఒక బౌల్ లో 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి, బొప్పాయి గుజ్జు 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలిపి మీ ముఖానికి అప్లై చేసి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి తరువాత టవల్ తో శుభ్రంగా తుడవండి.
పెరుగులోని లాక్టిక్ ఆమ్లం చర్మంలో ఉండే మ్రుత కణాలను, మలినాలను తొలగించి చర్మానికి కాంతినిస్తుంది. ఎగ్ వైట్ చర్మం శుభ్రపరిచి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అంతేకాకుండా వృద్ధాప్య ఛాయలు, మచ్చలను తొలగిస్తుంది. ఒక బౌల్ లో ¼ చెంచా ముల్తానీ మిట్టి, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 గుడ్డు తెల్ల సొన వేసి మెత్తటి పేస్టులా తయారు చేయండి. ఈ పేస్ట్ ముఖం మీద అప్లై చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.