కాకరకాయ వేపుడు ఇలా చేసుకొని తిన్నారా?

Durga Writes

కాకరకాయ ఎంత చేదుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎంత చేదు ఉన్న సరే.. కొందరు కాకరకాయను ఎంతో ఇష్టంగా తింటారు. అలాంటి వారు కాకరకాయను చేదు లేకుండా ఇలా చేసుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అయితే అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

కాకరకాయలు - పావుకేజీ, 

 

ఉప్పు - చెంచా, 

 

నూనె - తగినంత, 

 

వాము - చెంచా, 

 

ఆవాలు -అరచెంచా, 

 

నువ్వులు - చెంచా, 

 

ఇంగువ - చిటికెడు, 

 

కారం -చెంచా, 

 

పసుపు - కొద్దిగా, 

 

ధనియాలపొడి - చెంచా, 

 

పల్లీలపొడి - రెండు చెంచాలు, 

 

చింతపండు రసం - కొద్దిగా.

 

తయారీ విధానం.. 

 

కాకరకాయ ముక్కల్లో ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు పక్కన పెట్టక నీళ్లు అన్ని పిండేయాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేడిచేసి ఇంగువ, వాము వేయించాలి, అందులోనే నువ్వులు కూడా వేయించి కాకరకాయ ముక్కల్ని వేసేయాలి. మంట తగ్గించి వేయిస్తే కాకరకాయ ముక్కలు కాసేపటికి వేగుతాయి. ఆ తరవాత మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటీ వేయాలి. అంతే చేదులేని కాకరకాయ వేపుడు రెసిపీ రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: