మెగాస్టార్ తో రొమాన్స్ చేసిన.. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లను గుర్తుపట్టారా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి ఒకరు ఎంట్రీ ఇచ్చి స్టార్ గా ఎదిగిన తర్వాత ఇక వారి ఫ్యామిలీ నుంచి మరి కొంతమంది ఇండస్ట్రీకి పరిచయం కావడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మాత్రమే కాదు ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఇది ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ గా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. కేవలం హీరోలు మాత్రమే కాదు ఇప్పటివరకు ఇలా వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇలా వచ్చిన వారు కొంతమంది సక్సెస్ అయితే ఇంకొంతమంది మాత్రం కనుమరుగు  అవుతూ ఉంటారు.

 ఇలా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా ఎన్నో ఏళ్ల పాటు హవా నడిపించిన వారిలో హీరోయిన్ నగ్మా సిస్టర్స్ కూడా ఉన్నారు అని చెప్పాలి. అదేంటి హీరోయిన్ నగ్మా కు సిస్టర్స్ ఉన్నారా అనే ఆశ్చర్యపోతున్నారు కదా. ఒక్కరు కాదు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా అటు ప్రేక్షకులకు సుపరిచితులే. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇలా నగ్మా సిస్టర్స్ లో ఒకరు స్టార్ హీరో భార్య జ్యోతిక కావడం గమనార్హం. మొదట నగ్మా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమై తన అందచందాలతో కుర్రకారును ఎంతలా మతి పోగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 ఒక భాషకు మాత్రమే పరిమితం కాకుండా ఎన్నో భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అయితే అక్క నగ్మా బాటలోనే చెల్లెళ్లు కూడా ఇండస్ట్రీ బయటపడ్డారు  జ్యోతిక కంటే ముందు రెండో చెల్లి రోషిని ఇండస్ట్రీకి పరిచయమైంది   ఆ తర్వాత జ్యోతిక ఎంట్రీ ఇచ్చింది. ముగ్గురు అక్క చెల్లెలు కూడా ఎవరికి వారు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు నగ్మా రాజకీయాల్లో బిజీగా ఉంటే.  జ్యోతిక ఒకపక్క హీరోయిన్గా ఇంకో పక్క నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. రోషిని పెళ్లి చేసుకుని గృహిణిగా సెట్ అయింది. ఇక ఈ ముగ్గురిలో కామన్ పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లు కలిసి నటించిన ఏకైక హీరో మెగాస్టార్ మాత్రమే. చిరు, నగ్మా కాంబినేషన్లో ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు, రిక్షావోడు లాంటి సూపర్ హిట్ సినిమాలు ఉండగా.  మాస్టర్ సినిమాలో చిరంజీవి సరసన రోషిని నటించింది. ఇక ఠాగూర్ సినిమాలో చిరు సరసన జ్యోతిక నటించి మెప్పించింది  ఇలా ముగ్గురు అక్కచెల్లెళ్లతో చిరంజీవి రొమాన్స్ చేశాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: