కన్నీటి ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర సమస్యలని ఇక దేవుడే తీర్చాలి?

Purushottham Vinay
•అనేక సమస్యలతో అతలాకుతలమవుతున్న ఆంధ్ర రాష్ట్రం
•రాష్ట్ర సమస్యలని తీర్చడంలో ప్రభుత్వాలు అట్టర్ ప్లాప్

విభజన తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా దిగజారాయి. నాటి టీడీపీ ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా విభజన హామీలు ఏవి కూడా సాధించలేకపోయింది.2019లో అధికారానికి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అర్బన్ సంస్కరణల పేరిట ఆస్తి, ఇంటి పన్నులను అమాంతం పెంచింది. అంతేగాక గృహ అవసరాలకు వినియోగించే నీటిక్కూడా మీటర్లు బిగించింది. రేపోమాపో వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు మంగళం పాడేందుకు పంపుసెట్లకు కూడా మీటర్లు బిగించింది. కేంద్రం నుంచి ఒక్క ఎయిమ్స్ తప్ప మరే ప్రాజెక్టులను కూడా సాధించలేకపోయింది.విజ‌య‌వాడ మెట్రో సిటీగా రూపొందాల‌నేది.. విభ‌జ‌న స‌మ‌యంలో అనేక మంది నాయ‌కులు ప్ర‌క‌టించారు. డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు.. మెట్రో స‌ర్వీలు.. ఇలా న‌గ‌రం రూపు రేఖ‌లు మార్చాల్సి ఉంది. దీంతో పాటు.. వాణిజ్య రాజ‌ధానిగా తీర్చ‌దిద్దుతామ‌న్న ప‌రిస్థితి అలానే ఉంది..విశాఖని కూడా మెట్రో సిటీగా మలచాలి అనుకున్నారు. కానీ అది కూడా చేయలేదు. రాష్ట్రంలో విశాఖ,విజయవాడ మెట్రో ఊసే లేదు.అసలు రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదు. విశాఖ -కాకినాడ పెట్రో కారిడార్ను కూడా పూర్తిగా మర్చిపోయారు. అలాగే రామాయపట్నం మేజర్ పోర్టును కుదించి ప్రైవేటు రంగంలో మైనర్ పోర్టు గా మార్చేశారు. కడప ఉక్కు పరిశ్రమకు బదులుగా జిందాల్ స్టీల్ను తీసుకొచ్చారు.

చివరకు విశాఖ రైల్వే జోన్కు కూడా మోక్షం కలగలేదు. ఇలా కేంద్రం ఎలాంటి సహాయ సహకారం అందించకపోగా ప్రజలపై పెద్ద ఎత్తున భారాలు విధించింది.ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా తన కబంధ హస్తాల్లో ఇరికించుకుంది. ఇక ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కు కీల‌క‌మైన సాగునీరు, తాగు నీటికి వంశ‌ధార ప్రాజెక్టు అనేది చాలా కీల‌కం. అయితే.. దీనిపై ఒడిశా రాష్ట్రం పెడుతున్న మెలిక‌ల‌ను ఇప్ప‌టి దాకా ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేదు. దీంతో శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోని రైతులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నట్లు ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది.ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయాన్ని జీఎస్టీ పేరుతో కేంద్రం మింగేస్తోంది. ప్రత్యేక హోదాను కూడా అటకెక్కించింది. పెట్రోల్, డీజిల్ పై రెండున్నర రెట్లు ఎక్సైజ్ సుంకం ఇంకా సెస్లను బాదేస్తోంది. వంట గ్యాస్ ధరలని పెంచుకుంటూ వెళ్లింది. చివరకు నిత్యావసరాల పైన కూడా జీఎస్టీ విధిస్తోంది. అలాగే విద్యుత్ సంస్కరణల పేరిట ప్రజల మూలిగలు పీల్చేస్తుంది. ఇలా ఆంధ్ర రాష్ట్రం సమస్యలతో అల్లాడిపోతుంది.ఈసారి గెలిచే నాయకులు ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకుంటారో లేదో తెలీదు.ఇక రాష్ట్రాన్ని కాపాడేందుకు ఆ దేవుడే దిగి రావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: